టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా చిత్ర యూనిట్ రియాక్ట్ అయింది. శ్రీమంతుడు సినిమా కథ విషయంపై ఎవరూ ఎటువంటి అభిప్రాయాలకు రావొద్దంటూ యూనిట్ విజ్ఞప్తి చేసింది.
శ్రీమంతుడు సినిమాతో పాటుగా చచ్చేంత ప్రేమ అనే నవల కూడా రెండూ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, రెండూ ఒకటి కావు. ఆ పుస్తకంతో పాటు సినిమాను కూడా ఒకసారి పరిశీలించండి. అప్పుడు వాస్తవం ఎంటో తెలుస్తోంది. ఈ వ్వవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధి రివ్యూలోనే ఉంది. కాబట్టి ఎవరూ ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
రూ. 15 లక్షలు ఇస్తామన్నారు: శరత్
ఈ వివాదంపై రచయిత శరత్ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కించారని ఆయన ఆరోపించారు. ' 2012లో నేను రాసిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో ఇదే కథతో ఒక సినిమా చేద్దామని దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా మొదలు పెట్టాలనుకున్న సమయంలో 'శ్రీమంతుడు' థియేటర్‌లోకి వచ్చేసింది.
ఆ సమయంలో నా స్నేహితులు కొందరు సనిమా చూసి అది నా కథే అని చెప్పడంతో నేను కూడా వెళ్లి చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు వారు తెరకెక్కించారు. దీంతో డైరెక్టర్‌తో మాట్లాడాను కూడా ఈ కథ నాదేనని చెప్పాను. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఎంటర్ అయ్యారు. రూ. 15 లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్ నాకు ఎంతో సాయం అందించింది. వారి సాయంతోనే కోర్టు మెట్లెక్కాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను.' అని శరత్ చంద్ర పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment