టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సందేశాత్మక చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’ . ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూమీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆగడు’వంటి డిజాస్టర్ తర్వాత మహేశ్‌ను నిలబెట్టడంతో పాటు, అయన మార్కెట్‌ను అమాంతం పెంచింది ‘శ్రీమంతుడు’ . తాజాగా ఈ సినిమా మరో ఘనతను అందుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా శ్రీమంతుడు రికార్డుల్లోకెక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది.
2015లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీల్లో ప్రసారమైంది. అయితే కేవలం యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా మంది వీక్షించడం విశేషం. మామూలుగా తెలుగు సినిమా హిందీలో డబ్ అయితే ఇన్ని వ్యూస్ వస్తాయి. కానీ ఓ తెలుగు సినిమాకు ఏకంగా ఇన్ని వ్యూస్ రావడం ‘శ్రీమంతుడు’కే దక్కింది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, జగతిబాబు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిగా మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మహేష్ బాబు, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు.
#Record100MForSRIMANTHUDUhttps://t.co/XaQuDXKl7j pic.twitter.com/3YK21BdMWP
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2020
చదవండి:
మీ నిస్వార్థ సేవకు సెల్యూట్: మహేశ్ బాబు
పుష్ప కోసం హోమ్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment