
శ్రీమంతుడికి బీజేపీ అధ్యక్షుడి అభినందనలు
హైదరాబాద్: ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ శ్రీమంతుడు. హీరో మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో పాటు ఈ సినిమా పలువురికి ఆదర్శవంతంగా కూడా నిలుస్తోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయాలనే తపన పలువురి మనసులను తాకింది.
ప్రస్తుతం శ్రీమంతుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పాలమూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్నమహేష్ బాబును ట్విట్టర్ ద్వారా అభినందించారు.
Sincere thanks and best wishes srimanthudu mahesh babu for adopting a village in Paalamuru, telangana. #Srimanthudu
— G.Kishan Reddy (@kishanreddybjp) August 22, 2015