అందమైన అమ్మాయి కంట పడితే కత్తి లాంటి అమ్మాయి అంటారు. మరి మహేశ్ లాంటి అందగాళ్లు కనిపిస్తే... డెఫినట్లీ కత్తి లాంటి అబ్బాయి అని అనకుండా ఉండరు. మరి ఈ అందగాడు లుంగీ కడితే...! కేకలా ఉంటుంది కదూ! ‘చూడద్దొం టున్నా... చూస్తూనే ఉంటా’ అని ‘పోకిరి’ సినిమాలోని పాటలో లుంగీ కట్టి కాసేపు అలరించారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.
తాజాగా ఆయన ‘శ్రీమంతుడు’ సినిమా కోసం లుంగీ కట్టారు. పల్లెటూరినే కాకుండా అక్కడి వేషభాషలను దత్తత తీసుకునే ‘శ్రీమంతుడు’ హర్ష పాత్రలో మహేశ్‌బాబు అలరించనున్నారని ఈ స్టిల్ ద్వారా తెలుస్తూనే ఉంది. పక్కా పల్లెటూరి లుక్‌లో మహేశ్ సూపర్బ్‌గా ఉన్నారని ఆయన అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రశంసల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ సన్నివేశానికి రీ-రికార్డింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అసలెందుకు మహేశ్ లుంగీ కట్టాడో తెలియాలంటే ‘శ్రీమంతుడు’ సినిమా చూడాల్సిందే. మది ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘మహేశ్‌బాబు లుంగీ కట్టి, అలా నడుస్తూంటే సెట్‌లో అందరం నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమాకు సంబంధించి మర్చిపోలేని అనుభూతులివి. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. మహేశ్ అభిమానులకు ఈ సినిమా ఓ పండగే’’ అని చెప్పారు.
మహేశ్ హల్‌చల్ గెటప్
Published Wed, Aug 5 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement