Mahesh Babu Pokiri Special Show Creates Storm At Box Office Collections - Sakshi
Sakshi News home page

Pokiri Box Office Collections: పండుగాడి దెబ్బకి షేక్‌ అయిన బాక్సాఫీస్‌

Published Fri, Aug 12 2022 4:41 PM | Last Updated on Fri, Aug 12 2022 5:15 PM

Mahesh Babu Pokiri Re Release Special Show Creats Storm At Box Office - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు- మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం పోకిరి. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మహేశ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. తాజాగా ఆగస్ట్‌9న మహేశ్‌ బాబు బర్త్‌డే సందర్భంగా మరోసారి థియేరట్స్‌లో పోకిరి చిత్రం సందడి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల కోలాహాలం మధ్య ఈ సినిమాకి మరోసారి భారీ రెస్పాన్స్‌ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు ఇలా మొత్తంగా రూ. 1.5కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.స్పెషల్‌ షోస్‌కు ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement