మహేశ్‌ బాబు మేనియా.. థియేటర్స్‌లో 'పోకిరి' రీసౌండ్‌ | Mahesh Babu Birthday Special: Pokiri Re Release In Theatres | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్‌ బాబు 'పోకిరి' స్పెషల్‌ షో.. ఫ్యాన్స్‌కు పండగే

Published Tue, Aug 9 2022 10:10 AM | Last Updated on Tue, Aug 9 2022 10:19 AM

Mahesh Babu Birthday Special: Pokiri Re Release In Theatres - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయ్యిద్దో వాడే పండుగాడు' అనేలా బాక్సీఫీస్‌ రికార్డులను షేక్‌ చేసిన సినిమా ఇది. తాజాగా నేడు(మంగళవారం)మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్‌ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే..

ప్రపంచ ‍వ్యాప్తంగా 300వరకు షోలతో 4కె వెర్షన్‌లో రీప్రింట్‌తో ఈ సినిమాను థియేరట్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ సహా అన్ని చోట్ల టికెట్స్‌ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.దీంతో మహేశ్‌ మేనియా ఏంటన్నది మరోసారి అర్థమవుతుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ బాబు అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్‌ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement