pokiri cinema
-
ఆ సీన్ నా కళ్లముందే కనిపిస్తోంది: రాజ్ తరుణ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన చిత్రం పోకిరి. 2006లో రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో ఓ సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ మూవీ విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని సినీ ప్రియులు, మహేశ్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలోని 'ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు' అనే పవర్ఫుల్ డైలాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.రాజ్ తరుణ్ తన ట్విటర్లో రాస్తూ..' గోపాలపట్నంలోని శంకర థియేటర్లో చూసిన పోకిరి సినిమా ఇప్పటికీ గుర్తుంది. కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్నివేశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పటికీ నా కళ్ల ముందే కనిపించినట్లు ఉంది. దిమ్మ తిరిగి బాక్సాఫీస్ బ్లాక్ అయిపోయింది... ఇండియా మొత్తం షేక్ అయిపోయింది ' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. పూరి, మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన బిజినెస్మెన్ సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. The streets will never forget the BULLET-FIRING performance of our Superstar @urstrulyMahesh in Indian Cinema History!!! 🤗🤗🔥🔥#18YearsOfSouthIndustryHitPokiri #Pokiri— Raj Tarun (@itsRajTarun) April 28, 2024 -
నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!
షాయాజీ షిండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు పోకిరీ సినిమాలో ఆయన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అందరూ ఇదే కాన్సెప్ట్‌తో బతుకుతున్నారు' అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ఈ చిత్రంలో పోలీసు అధికారిగా షాయాజీ షిండే చాలా వ్యంగ్యంగా మాట్లాడే సీన్ అప్పట్లో అభిమానులను అలరించింది. ఆ తర్వాత అరుంధతి చిత్రంలో విభిన్నమైన పాత్రలో మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే తెలుగులో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాయాజీ తెలుగులో నటించండపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షాయాజీ షిండే మాట్లాడుతూ..' నాకు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. పూరి జగన్నాధ్ నా కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు. పోకిరీ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పోకిరీ తర్వాతే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ హిందీలో తెరకెక్కించిన పోకిరీ చిత్రంలో నటించలేకపోయాను. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారు. మొదటి సారి ఆయన చిత్రంలో నటించేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి. మనందరం ఆర్టిస్టులం. మనది ఒకటే ఫ్యామిలీ అని చెప్పేవారు. నన్ను తన కుటుంబ సభ్యునిలాగా చూసుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్రేట్ స్టార్స్‌గా ఉంటారు.' అని అన్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఘర్ బంధుక్ బిర్యానీ చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !) -
తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!
హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు ఆడియెన్స్‌కి కొత్తగా చెప్పేదేం లేదు. 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. సినిమాలు- వెబ్ సిరీసులు చేసింది. అలాంటి బ్యూటీ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. కొన్నినెలల ముందే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తొమ్మిది నెల కావడంతో తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..) హీరోయిన్ ఇలియానా తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్ కి మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్నెస్ పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదంతా కాదన్నట్లు కొన్నాళ్ల ముందు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. తల్లి కాబోతున్నట్లు అయితే చెప్పింది కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇలియా తొలుత రివీల్ చేయలేదు. కొన్నిరోజుల ముందు ఆ వ్యక్తి ఎవరో ఫొటోని పోస్ట్ చేసినప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సరే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టా స్టోరీలో ఇలియానా రాసుకొచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలో ఇలియానా ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. (ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్) -
అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి
ఏ సినిమాలో అయినా స్క్రీన్ పై కనిపించేవాళ్లు కేవలం నటులు. కానీ మనమేమో హీరోలని అభిమానిస్తాం, హీరోయిన్లని ప్రేమిస్తాం, విలన్స్‌ని ద్వేషిస్తాం. చెప్పాలంటే విలన్ పాత్రని క్రూరంగా చూపిస్తే మనమే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సదరు విలన్ యాక్టర్స్ నిజ జీవితంలో అలా ఉండరు! కానీ ఆ పాత్రల తాలుకూ ప్రభావం మాత్రం వాళ్లపై గట్టిగానే పడుతుంది. తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ వస్తూనే ఉంటారు. కానీ చాలామందికి ఆశిష్ విద్యార్థి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో 'పద్మావతి హ్యాపీయేనా?' అనే డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఈ నటుడే గుర్తొస్తాడు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ విలన్ పాత్రలు చేసిన ఇతడు.. ఆ తర్వాత కామెడీ విలన్ రోల్స్ కి షిప్ట్ అయ్యాడు. ఏదేమైనా వీటి వల్ల తను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) 'సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చేసిన అలాంటి పాత్రల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్స్ తమ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకోలేరు! కదా? వాటి ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ కామెంట్స్.. అన్నీ!' అని నటుడు ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టాలో దీనితోపాటు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం చూసుకుంటే.. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మరోవైపు ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2001లో రాజోషి బరువాని పెళ్లి చేసుకున్న ఇతడు.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ మధ్యే రూపాలీ బరువా అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
మహేశ్ బాబు మేనియా.. థియేటర్స్‌లో 'పోకిరి' రీసౌండ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు' అనేలా బాక్సీఫీస్ రికార్డులను షేక్ చేసిన సినిమా ఇది. తాజాగా నేడు(మంగళవారం)మహేశ్ బర్త్‌డే సందర్భంగా పోకిరి సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. చదవండి: నమ్రతను ఒప్పుకోని మహేశ్ ఫ్యామిలీ.. అప్పుడు ఏం చేశారంటే.. ప్రపంచ వ్యాప్తంగా 300వరకు షోలతో 4కె వెర్షన్లో రీప్రింట్‌తో ఈ సినిమాను థియేరట్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సహా అన్ని చోట్ల టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.దీంతో మహేశ్ మేనియా ఏంటన్నది మరోసారి అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలోనూ హ్యాపీ బర్త్‌డే మహేశ్ బాబు అనే ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ #PokiriSpecialShows No one can touch his craze 200 special shows and counting #POKIRI This is dream for every hero but now under his feet #HappyBirthdayMaheshBabu #PokiriSpecialShows @urstrulyMahesh pic.twitter.com/VRXC8so4Ud — ajay_kumar_kesagani (@ajay_kesagani) August 9, 2022 -
4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా..
Pokiri Releasing With 4K Remastered Version On Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్‌గా, మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి పరిచమైన మహేశ్ బాబు తనదైన నటన, అభినయంతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. మహేశ్ సినిమాలంటే ఎంతగా ఆదరిస్తారో, అంతకుమించి ఆయన బర్త్‌డే కోసం ఎదురుచూస్తారు. ఎందరో అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ వేడుక సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. 'రాజ కుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా 'పోకిరి'. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2006లో విడుదలై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న 'పోకిరి' సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. వరల్డ్ వైడ్‌గా రిలీజవతున్న ఈ పోకిరి సినిమాను '4కె అల్ట్రా హెచ్డీ' ప్రింట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్. అంతేకాకుండా 'పోకిరి' స్పెషల్ షోకు వచ్చిన డబ్బుతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నారు. ఎమ్బీ ఫౌండేషన్ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. ఈ ఆగస్టు 9 సూపర్ స్పెషల్ కానుందని అందులో తెలిపారు. -
Anand Mahindra: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?
టాలీవుడ్లోనే కాదు రిమేకైన అన్ని భాషల్లో దుమ్ము రేపింది పోకిరి సినిమా. ఆ సినమాలో ఫేమస్ డైలాగుల్లో ఒకటి.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహేశ్ మాటలతోనే తూటాలు పేల్చాడు. సరిగ్గా అలాంటి డైలాగ్‌నే చైనా రక్షణ బడ్జెట్ కేటాయింపులను ఎద్దేవా చేస్తూ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి దాదాపు 230 బిలియన్ డాలర్లు కేటాయించినట్టు చైనా ప్రకటించింది. ఇంచుమించు అమెరికా స్థాయిలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయించింది చైనా. మన దేశ రక్షణ బడ్జెట్‌తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి. వీటిని ప్రస్తావిస్తూ చైనాకు చురకలు అంటించారు ఆనంద్ మహీంద్రా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉదహారిస్తూ సైజ్ అనేది అసలు విషయమే కాదు. ఫ్యూచర్లో యుద్ధ రీతులు మొత్తం మారిపోనున్నాయి. భారీగా ఉండే యుద్ధ ట్యాంకుల కాన్వాయ్‌ని అతి చిన్నగా ఉండే సాయుధ డ్రోన్లు తుత్తునియలు చేశాయి. ఎంత ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్‌గా ఖర్చు పెట్టామన్నదే లెక్క అంటూ బడాయిలకు పోయిన చైనాకు చురకలు అంటించారు ఆనంద్ మహీంద్రా. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ చైనా పట్ల వ్యంగగా చేసిన ట్వీట్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. భవిష్యత్తులో వార్ఫేర్ పూర్తిగా మారిపోనుందన్నారు. శాటిలైట్, కమ్యూనికేషన్ ఆధారిత యుద్ధం ప్రధానంగా జరుగుతుందన్నారు. దానికి తగ్గట్టుగా మారడం బెటర్ తప్పితే భారీ ఆయుధాలు సమకూర్చుకోవడం వృధా అంటున్నారు నెటిజన్లు. ‘Size doesn’t matter.’ The future of warfare will be different. In the Ukraine, armed drones are playing havoc with convoys of tanks. It’s not how much we spend but how smartly we spend that will matter… https://t.co/K5VoFkZ6wd — anand mahindra (@anandmahindra) March 9, 2022 చదవండి: Anand Mahindra: రష్యా - ఉక్రెయిన్ దేశాలే కాదు..ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది -
పోకిరి మూవీకి 15 ఏళ్లు.. నమ్రత కామెంట్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటికి ఈ సినిమాను మర్చిపోని వారు లేరు. పోకిరిలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ఇప్పటికి వినబడుతూనే ఉంటాయి. ఇక ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు, ‘ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?’ అనే డైలాగ్స్ ఎంత పాపులరయ్యాయో అందరికి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ‘పోకిరి’ చిత్రం విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పండు ఫొటోను షేర్ చేస్తూ తన స్పందనను తెలిపారు. ‘;పోకిరి ఒక సంచలనాత్మక చిత్రం. క్లాస్, మాస్ వంటి సంపూర్ణ మిశ్రమ చిత్రం. పండుగా మహేశ్ జీవితకాలం గుర్తుండిపోయే అద్భుతమైన చిత్రం’ అంటూ రాసుకొచ్చారు. కాగా పోకిరి మూవీని కోరియోగ్రఫర్, దర్శకుడు, ప్రభుదేవ హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘వాంటెడ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో ‘పోక్కిరి’గా కూడా రీమేక్ అయ్యింది. ఇందులో మహేశ్ పాత్రలో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించాడు. కాగా ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అదనపు రాజకీయం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా.. లేదా.. పోకిరీ సినిమాలో ఓ రేంజ్లో పేలిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఒంటబట్టించుకున్నట్లున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా పగ్గాలు చేపట్టడంతో అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతున్నారు. ఉన్నన్నాళ్లూ ఎంతో కొంత వెనకేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఆదర్శ రైతులు, డీలర్లను తొలగించి తమ వారికి ‘ఉపాధి’ కల్పించిన నేతలు.. సర్వశిక్ష అభియాన్‌లో నిధులు పుష్కలంగా ఉన్నా స్వలాభం కోసం అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా వ్యాప్తంగా 395 స్కూళ్లలో 531 గదులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవి ఏ క్షణాన కూలిపోతాయో తెలీని పరిస్థితి నెలకొనడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు దినదినగండంగా గడుపుతున్నారు. 15 మునిసిపల్ స్కూళ్లలో 42 గదులు, ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 30 గదులు, 326 మండల పరిషత్ పాఠశాలల్లో 341 గదులు, 47 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 118 గదులు శిథిలావస్థకు చేరాయి. వీటి స్థానాల్లో కొత్తవాటిని ప్రభుత్వం మంజూరు చేసింది. శిథిలావాస్థ గదులను కూల్చేసి కొత్త గదులను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఇందుకోసం సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక్కో గదికి రూరల్ ప్రాంతంలో రూ. 6.5 లక్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.7.3 లక్షలు మంజూరు చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా అధికారులపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పనులు ప్రారంభానికి అధికారులే ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతుండడం విశేషం. 718 గదులకు గాను 58 ప్రారంభం జిల్లాకు 2014-15 విద్యా సంవత్సరానికి 718 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. వీటిలో 464 శిథిలావస్థకు చేరిన గదుల స్థానాల్లో కొత్తగా నిర్మించేందుకు, 245 అదనపు తరగతి గదులు, 9 అప్‌గ్రేడేషన్ పాఠశాలల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. శిథిలావస్థకు చేరిన వాటిని కూల్చేసి అక్కడ నిర్మించడం అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో కూడా గతంలో జరిగిన ఘటనల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా పనులు సాగడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో మంజూరైన 718 గదుల్లో ఇప్పటిదాకా కేవలం 58 నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. అందులోనూ రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడకముందే ప్రారంభమైన పనులే అధికం. రాయదుర్గం, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల మినహా ఇతర నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఒక్కపనీ ప్రారంభం కాలేదు. మేం చెప్పేదాకా పనులు ప్రారంభించొద్దు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ఆమోదం మేరకే నిర్మాణ పనులు అప్పగించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఎస్‌ఎంసీల పాత్ర నామమాత్రంగా తయారైంది. చాలా పాఠశాలల ఎస్‌ఎంసీల్లో తాము సభ్యులుగా ఉన్నామన్న సంగతి కూడా వారికి తెలీదు. స్థానికంగా ఉన్న చోటా నాయకులు సూచించిన వారి పేర్లను రాసేసి ఎస్ఎంసీతో ఆమోదముద్ర వేయిస్తారు. ఈ రకంగా దాదాపు ఏ ఒక్క పాఠశాలలోనూ ఎస్ఎంసీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే పనులు దక్కుతున్నాయి. అయితే పర్సెంటీజీలు కుదరక నాయకులు ఆమోదం తెలపడం లేదు. ప్రభుత్వ పరంగా వస్తున్న ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని కొందరు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా...‘మేం చెప్పేదాకా పనులు ప్రారంభించొద్దు. మీకేం అంత తొందర’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని ఉరవకొండ, కదిరిలోనూ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అధికారులపై హల్చల్ చేస్తున్నారు. తాము చెప్పినవారికి కాకుండా వేరెవరికైనా పనులు అప్పగించారో.. మీ ఇష్టం అంటూ ఆయా నియోజకవర్గాల నేతలు అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం అధికార పార్టీ నేతలు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి రాజకీయాల కోసం పిల్లలను బలిచేస్తారేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 2011 డిసెంబరు 13న పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లి ప్రాథమిక పాఠశాలలో గది పైకప్పు కూలి లోకేష్ అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. 2013 జూన్ 28న కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి పాఠశాల గది పైకప్పు పెచ్చులూడి సుమారు 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈనెల 11న అర్ధరాత్రి కంబదూరు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల గది పైకప్పు కూలింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే వెంటనే శిథిలావస్థకు చేరుకున్న గదులను కూల్చేసి వాటి స్థానాల్లో నూతన గదులను నిర్మించాల్సి ఉందని అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. నెలాఖరులోగా ప్రారంభిస్తాం చాలా స్కూళ్లలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. వాటిని కూలదోసి కొత్త గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే డీఈలతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో నెలాఖరులోగా అన్ని పనులూ ప్రారంభిస్తాం. - వెంకటస్వామి, ఎస్ఎస్ఏ ఈఈ