షాయాజీ షిండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు పోకిరీ సినిమాలో ఆయన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అందరూ ఇదే కాన్సెప్ట్‌తో బతుకుతున్నారు' అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది.
(ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!)
ఈ చిత్రంలో పోలీసు అధికారిగా షాయాజీ షిండే చాలా వ్యంగ్యంగా మాట్లాడే సీన్ అప్పట్లో అభిమానులను అలరించింది. ఆ తర్వాత అరుంధతి చిత్రంలో విభిన్నమైన పాత్రలో మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే తెలుగులో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాయాజీ తెలుగులో నటించండపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
షాయాజీ షిండే మాట్లాడుతూ..' నాకు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. పూరి జగన్నాధ్ నా కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు. పోకిరీ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పోకిరీ తర్వాతే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ హిందీలో తెరకెక్కించిన పోకిరీ చిత్రంలో నటించలేకపోయాను. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారు. మొదటి సారి ఆయన చిత్రంలో నటించేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి. మనందరం ఆర్టిస్టులం. మనది ఒకటే ఫ్యామిలీ అని చెప్పేవారు. నన్ను తన కుటుంబ సభ్యునిలాగా చూసుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్రేట్ స్టార్స్‌గా ఉంటారు.' అని అన్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఘర్ బంధుక్ బిర్యానీ చిత్రంలో కనిపించారు.
(ఇది చదవండి: మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !)
Comments
Please login to add a commentAdd a comment