
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్‌ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో చిరు పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తుండగా నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే..
ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చిరు ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటిస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఇందులో పూరీ జర్నలిస్ట్‌గా కనిపిస్తాడని అన్నారు. ‘‘మా సినిమాలో ఒక యూట్యూబర్ పాత్ర ఉంది. సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. స్టోరీ నరేటర్‌గా చేయాలి. ఈ రోల్ కోసం ఎవరా? అని డైరెక్టర్ ఆలోచిస్తున్న క్రమంలో పూరిని తీసుకుంటే ఎలా ఉంటుందని మోహన్ రాజాకు చెప్పాను.
చదవండి: క్రేజీ అప్‌డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!
దీంతో వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ.. ‘ఆయన నటిస్తారా? అయితే మీరే ఆయనను అడగండి’ అన్నాడు. వెంటనే నేను ఫోన్ తీసుకుని పూరికి ఇలా అని చెప్పగానే.. ‘చస్తే చేయను’ అన్నాడు. ‘మీ ముందు నేను నటించడమేంటి సార్.. నావల్ల కాదు’ అన్నాడు. కానీ నేనే పట్టుబట్టి ఒప్పించాను. షూటింగ్ లోకేషన్స్ వస్తు కూడా చాలా వణికిపోయాడు. కానీ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. తెర ఆయనను చూసి ఓ డైరెక్టర్‌లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా! అని మీరంత ఆశ్చర్యపోతారు’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.
Comments
Please login to add a commentAdd a comment