Sayaji Shinde
-
రాజకీయాల్లోకి నటుడు 'సాయాజీ షిండే' ఎంట్రీ
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈమేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులే. టాలీవుడ్లో ఆయన చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్దిరోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు.మహారాష్ట్రలోని NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)లో తాజాగా ఆయన చేరారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఉండే వర్గంలో ఆయన చేరారు. ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సతారా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.జేడీ చక్రవర్తి నటించిన 'సూరి'తో తెలుగు తెరకు పరిచయమైన సాయాజీ షిండే.. 'ఠాగూర్'తో పాపులర్ అయ్యారు. చాలా సినిమాల్లో ఆయన విలన్ పాత్రలే పోషించారు. పోకిరి,అతడు, రాఖీ,నేనింతే,కింగ్,అదుర్స్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
సాయాజి షిండే హెల్త్ అప్డేట్ ప్రకటించిన వైద్యులు
ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు. సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు. సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Sayaji Shinde (@sayaji_shinde) -
ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
ప్రముఖ నటుడు సాయాజి షిండే ఆస్పత్రిపాలయ్యాడు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్ మాట్లాడుతూ.. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు. ఆంజియోప్లాస్టీ దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాల్సిందేనని చెప్పాం. రెండుమూడు రోజుల క్రితం తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం అని వెల్లడించాడు. బహుభాషానటుడు కాగా సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ సీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి 'యాత్ర 2' -
నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!
షాయాజీ షిండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు పోకిరీ సినిమాలో ఆయన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. 'తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా.. అందరూ ఇదే కాన్సెప్ట్‌తో బతుకుతున్నారు' అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. (ఇది చదవండి: షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!) ఈ చిత్రంలో పోలీసు అధికారిగా షాయాజీ షిండే చాలా వ్యంగ్యంగా మాట్లాడే సీన్ అప్పట్లో అభిమానులను అలరించింది. ఆ తర్వాత అరుంధతి చిత్రంలో విభిన్నమైన పాత్రలో మెప్పించారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే తెలుగులో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాయాజీ తెలుగులో నటించండపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షాయాజీ షిండే మాట్లాడుతూ..' నాకు ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు. పూరి జగన్నాధ్ నా కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు. పోకిరీ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. పోకిరీ తర్వాతే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది. కానీ హిందీలో తెరకెక్కించిన పోకిరీ చిత్రంలో నటించలేకపోయాను. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారు. మొదటి సారి ఆయన చిత్రంలో నటించేటప్పుడు నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా నాకు చెప్పండి. మనందరం ఆర్టిస్టులం. మనది ఒకటే ఫ్యామిలీ అని చెప్పేవారు. నన్ను తన కుటుంబ సభ్యునిలాగా చూసుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎప్పుడు గ్రేట్ స్టార్స్‌గా ఉంటారు.' అని అన్నారు. కాగా.. ఈ ఏడాదిలో ఘర్ బంధుక్ బిర్యానీ చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: మూడు దశాబ్దాల పాటు సినిమాలు.. ఇప్పుడేమో అత్యంత దీన స్థితిలో !) -
ఆ నటుడు నన్ను మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు
ప్రముఖ నటుడు షాయాజీ షిండే టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆ డైలాగ్ ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించారు. టాలీవుడ్లో సోలో, సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో సహా పలు చిత్రాల్లో కనిపించారు. తాజాగా ఆయనపై మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అసలేం జరిగిందంటే..: అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ మూవీలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేశారు. నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారు. ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు. నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతోఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారు. షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ. 5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు. -
షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి
తమిళసినిమా: చిత్ర షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి. ఆశ్చర్యానికి గురైన చిత్ర యూనిట్. నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పాండిముని. ఇంతకు ముందు ధనుష్ నటించిన తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్, యారడీ నీ మోహిని వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్కే.ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని. జాకీష్రాప్ అఘోరిగా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో కొత్త నటుడు ఆశీప్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో మేఘలి, జ్యోతి, వైష్టవి, యాషిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో షియాజీ షిండే నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది భయంకరమైన హర్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని అని చెప్పారు. చిత్ర షూటింగ్ కొత్తగిరిలో నిర్వహిస్తుండగా ఒక ఆశ్చర్య సంఘటన జరిగిందన్నారు. మణకుడిసోలై అ ప్రాంతంలో కుట్టాంసామి అనే గుడి ఉందన్నారు.ఆ ప్రాంత ప్రజలు ఇష్టదైవంగా కొలుసుకుంటారని చెప్పారు. ఆ ఆలయానికి 700 వందల చరిత్ర ఉందని కొందరు, వెయ్యి సంవత్సరాల చరిత్ర అని చెబుతుంటారన్నారు. ఆ ఆలయానికి పాండవులు వచ్చి వెళ్లినట్టు చెబుతారన్నారు. ఒక గృహలాంటి ఆ గుడి వద్ద తాము పాండిముని చిత్ర షూటింగ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ గుడికి స్త్రీలకు అనుమతిలేదు, కాళ్లకు చెప్పులు వేసుకుని రాకూడదన్న ఆచారాలు ఉన్నట్లు ఆ ప్రాంత నివాసులు తెలిపారన్నారు. దీంతో తాము క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశామని చెప్పారు. మరుసటి రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ౖౖషూటింగ్కు రాగా నటి మేఘలికి స్వామి ఆవిహించి ఆడగడం మొదలెట్టిందన్నారు. దీంతో యూనిట్ వర్గాలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. వెంటనే ఆ ప్రాంత ప్రజలు వచ్చి పరిహార పూజలు నిర్వహించడంతో నటి మేఘలి నుంచి స్వామి వెళ్లిపోయాడని తెలిపారు. అదే మాదిరి మరో ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే పనకుడిసోలైలోని కుట్టంసామి ఆలయంపై భాగంలో హెలికాప్టర్ ఎగరలేదన్నారు. ఆలయం చుట్టూ తిరిగిన హెలీకాప్టర్ ఆలయంపై భాగంలో తిరిగకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచిన అంశం అన్నారు. ఆ ప్రాంతంలో ఆశీప్,మేఘలి,జ్యోతి,వైష్ణవి,యాషికలకు సంబంధించిన సన్నివేశాలను, మూడు పాటలను చిత్రీకరించినట్లు తెలిపారు. మొత్తం 25 రోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్‌ను నిర్వహించినట్లు చెప్పారు. తదుపరి షెడ్యూల్లో జాకీష్రాప్ నటిస్తున్న అఘోరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాత కస్తూరిరాజా తెలిపారు. దీనికి ఛాయాగ్రహణం మధుఅంజట్, సంగీతాన్ని శ్రీకాంత్ దేవా అందిçస్తున్నారు. -
ఈ బత్తుల బైరాగినాయుడి జోలికి వస్తే...
ఉత్తమ విలన్ ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుడిని చూడాల్సి ఉంటుంది కాంట్రాక్టర్ బద్రీనారాయణలో రాక్షసుడు కనిపించాలంటే ‘మిస్టేక్’ కనిపించాలి. బద్రీనారాయణ పాత్ర వేసిన షాయాజీ షిండే మాత్రం... తన నటనలో చిన్న మిస్టేక్ లేకుండా వెండితెరపై రాక్షసత్వాన్ని పండించి ‘గ్రేట్ విలన్’ అనిపించుకోగలరు. ‘ఏం నిల్చొని మాట్లాడుతున్నావు? కూర్చోవయ్యా. ఏం తీసుకుంటావు?’... ఇవి బత్తుల బైరాగి నాయుడి మాటలు. ఆహా... ఆ మాటల్లో ఎంత మర్యాద ఉంది! ‘రౌడీ వెధవలు మనకు ఎందుకు చెప్పు’ ఇవి కూడా బైరాగి నాయుడి మాటలు. ఆహా... రౌడీయిజం మీద ఎంత మంట! ‘ఒక్క ఓటు వేసి మీరు నన్ను మరిచిపోయినా... నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం మరిచిపోను’... ఇవి కూ....డా బైరాగి నాయుడి మాటలే.... ఆహా... ఎంత విశ్వాసం!! కానీ... బైరాగినాయుడిలో భూతద్దం వేసి వెదికినా... మర్యాద కనిపించదు. రౌడీయిజం మీద అపారమైన ప్రేమ తప్ప వ్యతిరేకత కనిపించదు. తనను గెలిపించిన ప్రజల పట్ల పొరపాటున కూడా విశ్వాసం కనిపించదు. ‘ఠాగూర్’ సినిమాలో బద్రీనారాయణ, ‘వీడే’ సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు షాయాజీ షిండే విలనిజానికి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. సొంతగొంతు కంటే... అరువు గొంతుతో మరింత ఎక్కువగా భయపెట్టగలడనేది ‘వీడే’ సినిమాతో రుజువు అయినా... ఆయన సొంతగొంతుతోనే మనకు ఎక్కువగా భయపడడం అలవాటైంది. సరే... ఆ గొంతులో పలికే ముక్కల ముక్కల తెలుగు సంగతి ఎలా ఉన్నా... ఆ కళ్లలో పలికే భావాలు చాలు... విలనిజం చిరునామా చెప్పడానికి! తెలుగు ప్రేక్షకులకు ‘మన ఇలనే’ అన్నంతగా దగ్గరైన... షాయాజీ షిండే... ఎక్కడి వారు? ఒక్కసారి అలా మహారాష్ట్ర వరకు వెళ్లొద్దాం... మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు షిండే. డిగ్రీ తరువాత ‘మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్’లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ‘నేను నటుడిని కాగలనా?’ అని మనసులో ఒక ప్రశ్న. ‘కావాలంటే ఏంచేయాలి?’ అనేది మరో ప్రశ్న. ‘మంచి నటుడు కావాలంటే ఏంచేయాలి?’ అని ఒక పెద్దాయనను అడిగినప్పుడు.... ‘మందుకొట్టే అలవాటు ఉందా?’ ‘సిగరెట్ తాగే అలవాటు ఉందా?’ అని అడిగాడు. ‘అప్పుడప్పుడు తాగుతాను’ అని జవాబు ఇచ్చారు షిండే. ‘‘చెడు అలవాట్లేమీ లేకుంటేనే మంచి నటుడివి కాగలవు’ అని విలువైన సలహా ఇచ్చాడు ఆ పెద్దాయన. ఇక అప్పటి నుంచి... ‘శరీరంపై శ్రద్ధ చూపాలి. యోగా చేయాలి’ ‘కొత్త జీవితం మొదలు పెట్టాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నారు షిండే. అంతే కాదు... ‘నటన’ గురించి తెలుసుకోవడానికి ఎందరితోనో మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్స్టేషన్ సమీపంలో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని ‘నాట్యశాస్త్ర’ పుస్తకాన్ని కూడా వదల్లేదు. ‘అభినయ సాధన్’లాంటి మరాఠీ పుస్తకాల నుంచి కూడా నోట్స్ తయారు చేసుకునేవాడు. ఇంట్లో వాళ్లు మాత్రం... ‘వీడికేమైనా పిచ్చా’ అనుకునేవాళ్లు. ‘ధార్మియ’ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు చాలామంది. ఈ హిజ్రా పాత్రతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘భారతి’ అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి... దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు. ‘ఠాగూర్’ సినిమాలో ‘బద్రీనారాయణ’గా నటించడంతో తెలుగు చలన చిత్రసీమకు ‘షాయాజీ షిండే’ రూపంలో సరికొత్త విలన్ పరిచయం అయ్యాడు. -
నేత్రదానం నేపథ్యంలో...
తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫాదర్’. కమల్ కామరాజ్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిల్మ్ క్రియేటివ్ పతాకంపై రాజ్ పచ్‌ఘరె నిర్మించారు. జగదీష్ పటర్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పాటల సీడీని సాయాజీ షిండే ఇటీవలే హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నేత్రదానం నేపథ్యంలో సందేశంతో పాటు మంచి వినోదం ఉన్న చిత్రం ఇదని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకలో శ్రీసురేశ్. నగేష్ నారదాశి, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వినోదం.. సందేశం..
ఆవకాయ్ బిర్యానీ, అరవింద్-2 ఫేం కమల్ కామరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఫాదర్’. షయాజీషిండే కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని నవదీప్ ఫిలిం క్రియేటివ్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాత రాజు పచ్‌ఘరె మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినోదం, సందేశం ఉన్న చిత్రమిది. బాలనటుడు జితేష్ , కమల్‌కామరాజు, షాయాజీషిండేల నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలను ఈ నెలాఖరులోనూ, చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్.వి.ఎస్ నాయుడు, సంగీతం: యువరాజ్ మోరె. -
'గాల్లో తేలినట్టుందే' స్టిల్స్