ప్రముఖ నటుడు సాయాజి షిండే ఆస్పత్రిపాలయ్యాడు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్ మాట్లాడుతూ.. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.
ఆంజియోప్లాస్టీ
దీంతో ఆయనకు కొన్ని పరీక్షలు చేయగా తన గుండెలో సమస్య ఉన్నట్లు తేలింది. హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. ఆంజియోప్లాస్టీ చేయాల్సిందేనని చెప్పాం. రెండుమూడు రోజుల క్రితం తన షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం రెడీ అయ్యారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడటంతో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తాం అని వెల్లడించాడు.
బహుభాషానటుడు
కాగా సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశాడు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ సీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్‌మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment