హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు ఆడియెన్స్‌కి కొత‍్తగా చెప్పేదేం లేదు. 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ‍్లింది. సినిమాలు- వెబ్ సిరీసులు చేసింది. అలాంటి బ్యూటీ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. కొన్నినెలల ముందే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తొమ్మిది నెల కావడంతో తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..)
హీరోయిన్ ఇలియానా తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్ కి మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదంతా కాదన్నట్లు కొన్నాళ్ల ముందు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.
తల్లి కాబోతున్నట్లు అయితే చెప్పింది కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇలియా తొలుత రివీల్ చేయలేదు. కొన్నిరోజుల ముందు ఆ వ్యక్తి ఎవరో ఫొటోని పోస్ట్ చేసినప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సరే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టా స్టోరీలో ఇలియానా రాసుకొచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలో ఇలియానా ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది.
(ఇదీ చదవండి: గే రిలేషన్‌షిప్‌లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్)
Comments
Please login to add a commentAdd a comment