ఏ సినిమాలో అయినా స్క్రీన్ పై కనిపించేవాళ్లు కేవలం నటులు. కానీ మనమేమో హీరోలని అభిమానిస్తాం, హీరోయిన్లని ప్రేమిస్తాం, విలన్స్‌ని ద్వేషిస్తాం. చెప్పాలంటే విలన్ పాత్రని క్రూరంగా చూపిస్తే మనమే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సదరు విలన్ యాక్టర్స్ నిజ జీవితంలో అలా ఉండరు! కానీ ఆ పాత్రల తాలుకూ ప్రభావం మాత్రం వాళ్లపై గట్టిగానే పడుతుంది.
తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ వస్తూనే ఉంటారు. కానీ చాలామందికి ఆశిష్ విద్యార్థి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో 'పద్మావతి హ‍్యాపీయేనా?' అనే డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఈ నటుడే గుర్తొస్తాడు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ విలన్ పాత్రలు చేసిన ఇతడు.. ఆ తర్వాత కామెడీ విలన్ రోల్స్ కి షిప్ట్ అయ్యాడు. ఏదేమైనా వీటి వల్ల తను చాలా ఇబ్బంది పడ‍్డానని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
'సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చేసిన అలాంటి పాత్రల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్స్ తమ యాక్టింగ్ గురించి గొప‍్పగా చెప్పుకోలేరు! కదా? వాటి ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ కామెంట్స్.. అన్నీ!' అని నటుడు ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టాలో దీనితోపాటు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.
ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం చూసుకుంటే.. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మరోవైపు ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2001లో రాజోషి బరువాని పెళ్లి చేసుకున్న ఇతడు.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ మధ్యే రూపాలీ బరువా అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
(ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment