Ashish Vidyarthi Opens Up About His Decision to Marry Rupali Barua Without Pain - Sakshi
Sakshi News home page

Ashish Vidyarthi: రెండో పెళ్లి నిర్ణయం.. ఆ విషయంలో ఇద్దరం బాధపడ్డాం: ఆశిష్ విద్యార్థి

Published Tue, May 30 2023 8:18 PM | Last Updated on Tue, May 30 2023 8:55 PM

Ashish Vidyarthi opens up about his decision to marry Rupali Barua without pain - Sakshi

మహేశ్ బాబు పోకిరీ చిత్రంలో మెప్పించిన ఆశిష్ విద్యార్థి టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కాగా.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

(ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?)

అయితే ఆశిష్ విద్యార్థి ఈ పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రూపాలీతో వివాహానికి అనుకున్నంత ఈజీగా జరగలేదని తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధ పెట్టిందని పేర్కొన్నారు. 

ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'గతేడాది వ్లాగింగ్ అసైన్‌మెంట్‌లలో భాగంగా నేను రూపాలిని కలిశా. ఆ తర్వాత మేము చాట్ చేయడం ప్రారంభించాం. రూపాలీ ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆ తర్వాత  ఆమె కూడా తన బాధను కాస్తా మరిచిపోయింది. అదే సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఇద్దరం ఆలోచించాం. ఆమెతో చాట్‌ చేస్తున్నప్పుడు తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నా. పెళ్లి చేసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఆమె జీవితంలో నేను ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది.' అని అన్నారు.

(ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్)

అయితే తన నిర్ణయం కుటుంబానికి తీవ్రమైన బాధ కలిగించిందని తెలిపారు. తన భార్య పిలూను స్నేహితుడిలా చూసేవాడినని అన్నారు.  ఆశిష్ మాట్లాడుతూ.. 'పిలూతో పెళ్లి తర్వాత మా జీవితం అద్భుతంగా సాగింది.  ఆమె నాకు భార్య మాత్రమే మంచి ఫ్రెండ్ కూడా. నాతో ఎప్పుడూ అలానే ఉండేది. కానీ ఈ పెళ్లికి ముందు చాలా బాధ అనుభవించా. విడిపోవడమనేది చాలా బాధ కలిగించింది. అది చాలా కష్టంగా అనిపించింది కూడా. ఈ విషయంలో మేమిద్దరం చాలా ఫీలయ్యాం.' అని రెండో పెళ్లి వెనుక పడ్డ బాధను పంచుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement