
మహేశ్ బాబు పోకిరీ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే మొదటి భార్య పిలూ విద్యార్థితో విడాకులు తీసుకున్నారు.
(ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!)
అయితే 57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. రెండో పెళ్లి చేసుకున్నాక తనను కించపరిచేలా ట్రోల్స్ చేశారని అన్నారు. చాలా దారుణమైన పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాల్లో మద్దతుగా నిలవాలని సూచించారు.
ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'తనపై బుడా(ముసలి), ఖుసత్ (సభ్యత , సంస్కారం లేని) లాంటి అవమానకరమైన పదాలతో ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవాళ్లమనే భయాన్ని మనలోనే ఉంచుకుంటాం. అదే విషయాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాం. కానీ ప్రస్తుతం జనరేషన్ మారింది. వయసు మీద పడినంత మాత్రాన ఎలాంటి పనులు చేయకూడదని మనకు మనమే చెప్పుకుంటున్నాం కదా. కానీ మన జీవితాన్ని సంతోషంగా ముగించాలకున్నప్పుడు.. ఎవరైనా సరే తోడు కావాలని ఎందుకు కోరుకోకూడదు?' అని అన్నారు.
(ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?)
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. ప్రతి విషయాన్ని చట్టబద్ధంగా వ్యవహరిస్తానని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆసక్తితోనే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రజలు ఒకరిని నిందించకుండా.చ. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని ఆశిష్ అన్నారు.