
పోకిరీ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ సినిమాలో పోలీసు పాత్రలో అభిమానులను అలరించారు. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. అయితే ట్రావెల్ చేస్తూ వీడియోలు చేస్తున్న ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయనకు పెళ్లి కాగా.. మొదటి భార్యతో 2021లో విడాకులు తీసుకున్నారు.
(ఇది చదవండి: సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!)
తాజాగా ఇటీవల ఆయన సొంతూరుకు వెళ్లారు. కేరళలోని హోమ్ టౌన్‌కు వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రెండో భార్య రూపాలిని మొదటిసారి మా ఊరికి వచ్చిందని వెల్లడించారు. తనకు సొంత గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తను బాల్యంలో ఉన్న ఇంటిని వీడియో చూపించారు. తొలిసారి తన భార్యతో కలిసి ఓనం పండుగకు వచ్చామని ఆశిష్ వివరించారు.
ఇన్‌స్టాలో రాస్తూ..'కేరళలోని నా స్వస్థలాన్ని సందర్శించాను. ఇక్కడ నా బాల్యంలో జ్ఞాపకాలు ఉన్నాయి. రూపాలికి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. తనతో కలిసి మొదటి ఓనం జరుపుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటు వయసులో పెళ్లి అవసరమా? అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే వాటిని ఆయన సున్నితంగా కొట్టిపారేశారు. రెండో భార్య రుపాలీ బరూవా సైతం అలాంటి వాటిని పట్టించుకోనని గతంలోనే తెలిపింది.
(ఇది చదవండి: విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment