Pokiri Movie 4K Remastered Version Releasing On Mahesh Babu Birthday - Sakshi
Sakshi News home page

Pokiri Movie 4K Version: మహేశ్‌ బాబు బర్త్‌డే స్పెషల్‌.. థియేటర్లలో మళ్లీ బ్లాక్‌బస్టర్ మూవీ

Published Wed, Aug 3 2022 5:00 PM | Last Updated on Wed, Aug 3 2022 6:05 PM

Mahesh Babu Birthday: Pokiri Releasing With 4K Remastered Version - Sakshi

Pokiri Releasing With 4K Remastered Version On Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్‌ స్టార్‌గా, మోస్ట్ గ్లామరస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు మహేశ్‌ బాబు. సూపర్‌ స్టార్ కృష్ణ నట వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి పరిచమైన మహేశ్‌ బాబు తనదైన నటన, అభినయంతో అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన పుట్టినరోజు వస్తుందంటే అభిమానులకు పెద్ద పండగే. మహేశ్ సినిమాలంటే ఎంతగా ఆదరిస్తారో, అంతకుమించి ఆయన బర్త్‌డే కోసం ఎదురుచూస్తారు. ఎందరో అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు. 

ఈ వేడుక సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్పెషల్‌ ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. 'రాజ కుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్‌ బాబు ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించాడు. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా 'పోకిరి'. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌  దర్శకత్వం వహించిన ఈ మూవీ 2006లో విడుదలై ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న 'పోకిరి' సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. వరల్డ్‌ వైడ్‌గా రిలీజవతున్న ఈ పోకిరి సినిమాను '4కె అల్ట్రా హెచ్‌డీ' ప్రింట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్‌. 

అంతేకాకుండా 'పోకిరి' స్పెషల్‌ షోకు వచ్చిన డబ్బుతో చిన్న పిల్లల గుండె ఆపరేషన్‌, పేద పిల్లల విద్యకు విరాళంగా ఇవ్వనున్నారు. ఎమ్‌బీ ఫౌండేషన్‌ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. ఈ ఆగస్టు 9 సూపర్‌ స్పెషల్‌ కానుందని అందులో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement