ఆ సీన్ నా కళ్లముందే కనిపిస్తోంది: రాజ్ తరుణ్ పోస్ట్ వైరల్ | Young Hero Raj Tarun Tweet On Mahesh Babu Pokiri Movie | Sakshi
Sakshi News home page

Raj Tarun: ఆ సీన్ నా కళ్లముందే కనిపిస్తోంది: రాజ్ తరుణ్ పోస్ట్ వైరల్

Published Sun, Apr 28 2024 7:54 PM | Last Updated on Sun, Apr 28 2024 7:54 PM

Young Hero Raj Tarun Tweet On Mahesh Babu Pokiri Movie

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబోలో వచ్చిన చిత్రం పోకిరి. 2006లో రిలీజైన ఈ చిత్రం ఇండస్ట్రీని షేక్‌ చేసింది. అప్పట్లో ఓ సెన్సేషన్‌ సృష్టించింది. తాజాగా ఈ మూవీ విడుదలై 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీని సినీ ప్రియులు, మహేశ్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలోని  'ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో ఆడే పండుగాడు' అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను యంగ్ హీరో రాజ్ తరుణ్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రాజ్ తరుణ్ తన ట్విటర్‌లో రాస్తూ..' గోపాలపట్నంలోని శంకర థియేటర్‌లో చూసిన పోకిరి సినిమా  ఇప్పటికీ గుర్తుంది. కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్నివేశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పటికీ నా కళ్ల ముందే కనిపించినట్లు ఉంది. దిమ్మ తిరిగి బాక్సాఫీస్ బ్లాక్ అయిపోయింది... ఇండియా మొత్తం షేక్ అయిపోయింది ' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కాగా.. పూరి, మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన బిజినెస్‌మెన్‌ సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement