శ్రీమంతుడి స్ఫూర్తితో.. పలుగు పట్టిన యాక్టర్ | actor brahmaji starts work with inspiration from srimanthudu | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడి స్ఫూర్తితో.. పలుగు పట్టిన యాక్టర్

Published Sat, Aug 8 2015 2:56 PM | Last Updated on Fri, Aug 17 2018 2:31 PM

శ్రీమంతుడి స్ఫూర్తితో.. పలుగు పట్టిన యాక్టర్ - Sakshi

శ్రీమంతుడి స్ఫూర్తితో.. పలుగు పట్టిన యాక్టర్

శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు ఓ సన్నివేశంలో స్వయంగా పలుగుపట్టి చెరువు పూడిక తీసేందుకు చేయి కలుపుతాడు. ఆ సన్నివేశంతో స్ఫూర్తి పొందాడో.. లేక మొత్తం సినిమా కాన్సెప్టు అయిన ఊరిని బాగు చేయాలన్న నినాదం చూసి ముచ్చట పడ్డాడో గానీ.. నటుడు బ్రహ్మాజీ కూడా పలుగు పట్టాడు. షార్ట్స్, టీషర్టు వేసుకుని పలుగు పట్టుకుని మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వాడు.

దానికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో దర్శనమిచ్చాయి. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. ఒళ్లు చెమటలు పట్టేలా కష్టపడుతున్నట్లు ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. నిజంగానే శ్రీమంతుడి స్ఫూర్తితో అంతా ఇలా ముందుకు వెళ్లి.. నాలుగు పనులు చేసి ఊళ్లను బాగుచేస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement