వెన్నెల్లో ఇద్దరు చంద్రులు.. చీకట్లో ప్రజలు: యాష్కీ | Madhu yashki fires on kcr and ktr | Sakshi
Sakshi News home page

వెన్నెల్లో ఇద్దరు చంద్రులు.. చీకట్లో ప్రజలు: యాష్కీ

Published Thu, Oct 22 2015 12:35 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

వెన్నెల్లో ఇద్దరు చంద్రులు.. చీకట్లో ప్రజలు: యాష్కీ - Sakshi

వెన్నెల్లో ఇద్దరు చంద్రులు.. చీకట్లో ప్రజలు: యాష్కీ

సాక్షి, హైదరాబాద్: నిన్నటిదాకా తిట్టుకున్న ఇద్దరు చంద్రులు ఇప్పుడు వెన్నెల్లో తేలుతూ రెండు రాష్ట్రాల ప్రజలను చీకట్లో ముంచుతున్నారని ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లను ఉద్దేశించి మాజీ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును జేజమ్మ కూడా రక్షించలేడన్న కేసీఆర్ ఇప్పుడు ఆయనతోనే లడ్డూలు, పూలగుత్తులు ఇచ్చిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసును ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న బెత్తెడుగాళ్లు జానెడు పనుల గురించి, సీఎల్పీ నేత జానారెడ్డి వంటి వారి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సినిమా పరిశ్రమను బ్లాక్‌మెయిల్ చేస్తూ శ్రీమంతుడు సినిమాకు నిర్మాతగా, బాహుబలి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా మంత్రి కేటీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. అవినీతిలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement