మహేష్ ఈజీగా రీచ్ అయ్యాడు..
తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు రీజనల్ సినిమాగా రూ.30, 40 కోట్లకు మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా ఇప్పుడు వంద కోట్ల మార్క్ను కూడా దాటేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం 'బాహుబలి'తో తొలిసారిగా ఈ ఫీట్ సాధించింది తెలుగు సినిమా. అంతేకాకుండా నెల వ్యవధిలోనే మరోసారి అదే రికార్డ్ను సొంతం చేసుకుంది. సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు సినిమా కేవలం 25 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అయితే బాహుబలి సినిమా కోసం మూడేళ్ల పాటు వందల మంది స్టార్ టెక్నిషియన్స్ పనిచేసి సాధించిన ఫీట్ను మహేష్ మాత్రం ఈజీగా రీచ్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా గట్టి పట్టు ఉన్న మహేష్, శ్రీమంతుడు సినిమాలో తమిళ, మళయాల మార్కెట్లపై కూడా తన ఆధిపత్యాన్ని చూపించాడు. మహేష్ చూపించిన బాటలో నడవటానికి మరింత మంది హీరోలు రెడీ అవుతున్నారు.