కొరటాల దర్శకత్వంలో హృతిక్ | koratala siva bollywood entry with srimanthudu remake | Sakshi
Sakshi News home page

కొరటాల దర్శకత్వంలో హృతిక్

Published Fri, Nov 20 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM

కొరటాల దర్శకత్వంలో హృతిక్

కొరటాల దర్శకత్వంలో హృతిక్

మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న శివ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. తెలుగులో మహేష్ బాబు హీరోగా ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ.

శ్రీమంతుడు సినిమా బాలీవుడ్ రీమేక్ రైట్స్ను ఈరోస్ ఇంటర్ నేషనల్ సంస్థతో కలిసి తానే స్వయంగా తీసుకున్నాడు శివ. ఇప్పటికే ఈ సినిమాను చూసిన హృతిక్, బాలీవుడ రీమేక్లో నటించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు. క్లైమాక్స్ పార్ట్లో కొన్ని మార్పులు సూచించిన బాలీవుడ్ స్టార్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు వర్షన్లో జగపతిబాబు కనిపించిన పాత్రలో బాలీవుడ్లో హృతిక్ రియల్ ఫాదర్ రాకేష్ రోషన్ ను నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు.

హృతిక్ ప్రస్తుతం మొహంజోదారో అనే పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, కొరటాల శివ ఎన్టీఆర్తో తెరకెక్కిస్తున్న జనతాగ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఆగస్టులో పూర్తి అయ్యే అవకాశం ఉంది కనుక ఆ తరువాత బాలీవుడ్ శ్రీమంతుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్లో తొలి సినిమాతోనే సంఛలనం సృష్టించిన కొరటాల శివ బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement