టాలీవుడ్లో మరో శ్రీమంతుడు | senior actor suman adopting mahaboobnagar dist suddhapally villege | Sakshi
Sakshi News home page

టాలీవుడ్లో మరో శ్రీమంతుడు

Published Wed, Nov 4 2015 12:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

టాలీవుడ్లో మరో శ్రీమంతుడు

టాలీవుడ్లో మరో శ్రీమంతుడు

శ్రీమంతుడు సినిమా ఇన్సిపిరేషన్తో వెనకపడిన గ్రామాలను దత్తత తీసుకోవాటానికి చాలామంది సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు తెలంగాణ నుంచి మహబూబ్నగర్ జిల్లా సిద్దాపురం గ్రామాన్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోగా, అదే బాటలో మరో నటుడు ప్రకాష్రాజ్ కూడా నడిచాడు. తెలంగాణలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్రాజ్ ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించాడు.

తాజాగా మరో సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ లిస్ట్లో చేరడానికి రెడీ అవుతున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు తెలిపిన సుమన్ తెలంగాణలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా, మాడుగుల మండలం, సుద్దపల్లి గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచన ఉన్నాడు. త్వరలోనే ఈ విషయాన్ని సుమన్ అధికారికంగా ప్రకటించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement