
ఆమిర్‌కు షాకిస్తున్న మహేష్‌బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండార్స్మెంట్ల విషయంలో ఇప్పటికే సౌతిండియాలో టాప్ ప్లేస్లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు సంబంధించిన యాడ్స్ మాత్రమే చేస్తున్న ఈ రాజకుమారుడు త్వరలోనే నేషనల్ యాడ్స్లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, ఆయనతో తమ అగ్రిమెంట్ ముగియటంతో, మహేష్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయట. శ్రీమంతుడు సినిమాతో భారీ కలెక్షన్లతో పాటు ఓవర్సీస్లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పలు కంపెనీలు మహేష్ మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే నెంబర్ పరంగా అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మహేష్.. నేషనల్ యాడ్స్లో కూడా సత్తా చాటితే సంపాదన పరంగా కూడా రికార్డ్ సృష్టించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.