'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా' | Madhie Sacrificed 50 Films For Ghazi | Sakshi
Sakshi News home page

'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా'

Published Sun, Feb 19 2017 12:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా'

'ఘాజీ కోసం 50 సినిమాలు వదులుకున్నా'

c. రెగ్యులర్ కమర్షియల్ జానర్కు భిన్నంగా, తొలి భారతీయ అండర్ వాటర్ వార్ ఫిలింగా గుర్తింపు తెచ్చుకున్న ఘాజీ.. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన మధీ ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ప్రస్తుతం ఘాజీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ మధీ, తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఘాజీ మేకింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎంత కష్టపడ్డారు అన్న అంశాలతో పాటు.. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన మధీకి తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే అప్పటికే ఘాజీ సినిమాకు కమిట్ అవ్వటంతో దాదాపు 50 చిత్రాలకు నో చెప్పాడట.

ఆవారా, మిర్చి, రన్ రాజా రన్, శ్రీమంతుడు, ఘాజీ లాంటి వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న మధీ, అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భాగమతితో పాటు ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీకి కూడా సినిమాటోగ్రఫీ అందించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement