
చరణ్ తరువాత ఎన్టీఆర్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఇప్పటికీ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గ్రామాలను దత్తత తీసుకోవటం అనే సోషల్ మెసేజ్తో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది సెలబ్రిటీలకు ఇన్సిపిరేషన్గా నిలిచింది. ఈ సినిమా తరువాత చాలా మంది సౌత్ సినిమా సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవటానికి ముందుకు వచ్చారు.
'శ్రీమంతుడు' లాంటి భారీ విజయం తరువాత, మహేష్ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. ఇంత మంచి సినిమా చేసిన తరువాత ఒక్క రామ్చరణ్ తప్ప ఇంకెవరు తనకు శుభాకాంక్షలు తెలియజేయలేదన్నాడు. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే 'శ్రీమంతుడు' రిలీజ్ సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే మహేష్కు స్వయంగా ఫోన్ చేసిన అభినందనలు తెలిపాడు.
'నాన్నకు ప్రేమతో' ఫారిన్ షెడ్యూల్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చిన ఎన్టీఆర్ 'శ్రీమంతుడు' సినిమాను చూశాడు. వెంటనే మహేష్ కు స్వయంగా కాల్ చేసిన ఎన్టీఆర్ ఇంత మంచి సినిమా చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ అక్టోబర్ రెండో వారంలో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ చేయనున్నాడు.