శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్ | SS Rajamouli praises srimanthudu movie | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్

Aug 8 2015 10:23 AM | Updated on Sep 3 2017 7:03 AM

శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్

శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్

‘శ్రీమంతుడు’ సినిమా చూసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఫ్లాటైపోయారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన తన ఫీలింగులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనం తిరిగి ఏదో ఒకటి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అంటూ.. సొంతూరి సెంటిమెంటుతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమా చూసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఫ్లాటైపోయారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన తన ఫీలింగులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టును ఫ్యామిలీ సెంటిమెంటుతో చాలా తెలివిగా కలిపారని, అదే ఈ సినిమా విజయ రహస్యమని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ చాలా బాగా చేసినందుకు అభినందనలు చెబుతూనే.. కలెక్షన్లు మాత్రం మహేశ్ బాబు వల్లే వస్తాయని స్పష్టం చేశారు. 
 
ఈ సినిమాలో మహేశ్ చాలా కూల్ గా కనపడుతూ, అంచనాలకు అందకుండా నటించి, ఏమాత్రం హడావుడి లేకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకుల హృదయాలను చేరుకున్నారన్నారు. యూనిట్ సమష్టి కృషి చాలా అత్యద్భుతంగా ఉందని రాజమౌళి మెచ్చుకున్నారు. ఇక శ్రుతిహాసన్ ని చూస్తే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామని, ఆమె తన నటనలో చాలా ఎత్తులు ఎదిగిందని ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడి విజన్ ను మాదీ ఫొటోగ్రఫీ మరింత పెంచిందని సాంకేతిక అంశాలనూ స్పృశించారు. తమ కుటుంబం మొత్తం ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామన్నారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలంటూ ముగించారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement