టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌! | NTR Challenges Mahesh Babu, Ram Charan And SS Rajamouli | Sakshi
Sakshi News home page

రాజమౌళి, మహేష్‌, చరణ్‌లకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌!

Published Fri, Jun 1 2018 11:29 AM | Last Updated on Fri, Jun 1 2018 6:31 PM

NTR Challenges Mahesh Babu, Ram Charan And SS Rajamouli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ విసిరిన ఛాలెంజ్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్వీకరించారు. నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం మోహన్‌లాల్‌ ఛాలెంజన్‌ను స్వీకరించానని సోషల్‌ మీడియాలో తెలిపారు. అందులో భాగంగానే జిమ్‌లో ట్రైనర్‌ స్టీవెన్స్‌ సూచనలతో తరచూ కసరత్తులు చేస్తానని చెప్పారు. జిమ్‌లో చేసిన తన వర్కవుట్స్‌ను వీడియో తీసి ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు తారక్‌. కావాల్సిన దానికంటే కాస్త ఎక్కువ బరువులతో ఎన్టీఆర్‌ కుస్తీ పట్టారని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ లో భాగంగా మరికొందరు టాలీవుడ్‌ ప్రముఖులను ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, డైరెక్టర్స్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివలకు ఎన్టీఆర్‌ ఫిట్‌నెస్‌ సవాల్‌ విసిరారు. అయితే చరణ్‌కు తన ఛాలెంజ్‌ గురించి చెప్పాలని ఉపాసనను ఎన్టీఆర్‌ కోరారు.

ఇదివరకే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌ వీడియోలను షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  ఛాలెంజ్‌ను స్వీకరించిన మోహన్‌లాల్‌.. ఎన్టీఆర్‌కు ఫిట్‌నెస్‌ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement