
శ్రీమంతుడిపై టాలీవుడ్ ప్రశంసల జల్లు
మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై సామాన్య ప్రేక్షకులు, మహేశ్ అభిమానులే కాదు.. టాలీవుడ్ దిగ్గజాలు కూడా చాలామంది ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులు వస్తున్నాయని, మొత్తం టీం అంతటికీ అభినందనలని 500 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించినందుకు అభినందనలని నిర్మాతలు రవిశంకర్, నవీన్, సీవీ మోహన్లకు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర అన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుందని ఆయన అన్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినిమాను ఎంతగానో ప్రశంసించారు. చాలా మంచి రిపోర్టులు వస్తున్నాయని, తన స్నేహితుడు మహేశ్ బాబుకు అభినందనలని ఆయన చెప్పారు. శ్రీమంతుడు గురించి టాక్ ఇప్పటికే వచ్చేసిందని, ఇది బ్లాక్బస్టర్ అవుతుందనే అందరూ చెబుతున్నారని మహేశ్ అన్న, సీనియర్ నటుడు నరేష్ ట్వీట్ చేశారు. ఇంకా.. నిఖిల్, సుధీర్ బాబు, రాహుల్ రవీంద్రన్, ప్రదీప్, గోపీమోహన్ తదితరులు అందరూ కూడా శ్రీమంతుడు సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
Show time srimanthudu...great reports from all over..congratulations to the whole team...
— rajamouli ss (@ssrajamouli) August 7, 2015