
‘శ్రీమంతుడు’లో రెండు కొత్త సీన్లు!
‘మా సంస్థలో వచ్చిన తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్, పొలిటీషియన్స్ అందరూ ఈ సినిమా చూసి అభినందిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ వారంలో సినిమా చూస్తానన్నారు’’ అని నవీన్ ఎర్నేని చెప్పారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ కాంబినేషన్‌లో శివ కొరటాల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. నేటి నుంచి మరో రెండు సీన్లను జత చేస్తున్నామని శివ కొరటాల తెలిపారు.