మహేష్తో మరోసారి శృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతారు. అందుకే ఒకసారి మంచి హిట్ వస్తే అదే కాంబినేషన్లో తిరిగి పనిచేయాలనుకుంటారు. మామూలు హీరోలు మాత్రమే కాదు సూపర్ స్టార్లు కూడా ఇలాంటి సెంటిమెంట్లనే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమా కోసం ఇలాంటి ఓ సక్సెస్ఫుల్ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడు.
శ్రీమంతుడు సక్సెస్తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసేస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్.
సామాజిక సమస్యల నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అకీరా అనే హిందీ సినిమా చేస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తి కాగానే మహేష్ సినిమా పని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి శృతిహాసన్తో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందించిన కాంబినేషన్లో సినిమా చేస్తే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.