సెంటిమెంట్ను మహేష్ బ్రేక్ చేస్తాడా? | Mahesh willing to do thanioruvan remake | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్ను మహేష్ బ్రేక్ చేస్తాడా?

Published Tue, Sep 8 2015 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

సెంటిమెంట్ను మహేష్  బ్రేక్ చేస్తాడా?

సెంటిమెంట్ను మహేష్ బ్రేక్ చేస్తాడా?

'శ్రీమంతుడు' సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న మహేష్ త్వరలో 'బ్రహ్మోత్సవం' షూటింగ్లో పాల్గొననున్నాడు. అయితే ఇదే సమయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రిన్స్ అభిమానులను కలవరపెడుతుంది. 16 ఏళ్ల కెరీర్లో మహేష్ ఇంత వరకు చేయని ఓ సాహసం త్వరలో చేయబోతున్నాడట. ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని ఈ సూపర్ స్టార్ త్వరలోనే ఓ తమిళ రీమేక్లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో శంకర్ డైరెక్షన్లో '3 ఇడియట్స్' సినిమాకు రీమేక్గా రూపొందిన 'స్నేహితుడు' సినిమా సమయంలో కూడా ఇదే చర్చ తెరమీదకు వచ్చింది. మహేష్తో ఈ సినిమాలో నటింపచేయాలని ఎంత ప్రయత్నించిన రీమేక్ సినిమా అన్న ఉద్దేశ్యంతో అంగీకరించలేదు. అదే సమయంలో తనకు రీమేక్ సినిమాలు చేయటం ఇష్టం లేదని తేల్చిచెప్పాడు రాకుమారుడు.

ఇటీవల తమిళంలో సంచలనం సృష్టిస్తున్న 'తనీఒరువన్' సినిమా నేపధ్యంలో మరోసారి అదే టాపిక్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాను మహేష్ హీరోగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ కూడా చూసిన మహేష్ ఇంతవరకు తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు. ప్రిన్స్ రెస్పాన్స్ చూసిన వారు మాత్రం మహేష్ తన కండిషన్స్ ను తనే బ్రేక్ చేసి 'తనీ ఒరువన్' రీమేక్ చేయటం ఖాయం అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement