‘2.ఓ’పై మహేష్‌ ప్రశంసలు | Mahesh Babu Praises Rajinikanth 2Point0 Team | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 3:21 PM | Last Updated on Fri, Nov 30 2018 3:21 PM

Mahesh Babu Praises Rajinikanth 2Point0 Team - Sakshi

ప్రస్తుతం సౌత్, నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో 2.ఓ ఫీవర్‌ కనిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సినీ ప్రముఖులు ఈ విజువల్‌ వండర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తరణ్‌ ఆదర్శ్‌, రమేష్‌ బాలా, శ్రీధర్‌ పిల్లై లాంటి ఫిలిం క్రిటిక్స్‌ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.

టాలీవుడ్ స్టార్స్‌ కూడా 2.ఓ సినిమాపై ట్వీట్ చేస్తూ మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే నాని, అల్లరి నరేష్ లాంటి స్టార్స్‌ ఆసక్తికర ట్వీట్స్‌తో ఆకట్టుకోగా తాజాగా మహేష్ బాబు 2.ఓ పై టీంను పొగడ్తలతో ముంచెత్తారు. ‘2.ఓ ఓ సినిమాటిక్‌ జెమ్‌. ఈ సినిమా మీకు గతంలో ఎప్పుడూ పరిచయం లేని ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. శంకర్‌ సార్‌ మీరు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. రజనీకాంత్ సర్‌, అక్షయ్‌ కుమార్‌, 2.ఓ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు మహేష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement