
దర్శకత్వమా.. నేనా! : మహేష్ బాబు
హైదరాబాద్ : తన పని గురించి మీడియాతో అంతగా పంచుకోవడానికి ఇష్టపడని మహేష్ కొన్ని సంగతులు పంచుకున్నాడు. ప్రస్తుతం నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఆయన దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తాను దర్శకత్వం చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పాడు. దర్శకత్వం చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలని, చాలా కష్టంతో కూడుకున్న పని.. నటుడిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. షూటింగ్ మొదలైందంటే క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోతాను.. డైరెక్టర్తో ఎప్పటికప్పుడు తన యాక్షన్ గురించి చర్చిస్తానన్నాడు. ప్రస్తుతం నేడు సహనిర్మాతగా ఉన్నాను.. పూర్తిస్థాయిలో ఫిల్మ్ ప్రొడక్షన్ చేసి పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని తాను అనుకోవడం లేదని తెలిపారు.
తనకు తెలుగుతో పాటు తమిళం బాగా మాట్లాడగలనని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తెలిపారు. ఇతర భాషలలో నటించే అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమిళం నాకు బాగా వచ్చు.. ఆ భాషలో మూవీలు చేస్తాను, కానీ బాలీవుడ్ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదన్నాడు. చిన్నప్పుడు తాను చెన్నైలోనే ఉండటంతో తమిళం నేర్చుకున్నానని చెప్పాడు.
తాను సాధారణ జీవితాన్ని గడిపానని, స్కూలుకు అందరిలా ఆటోలోనే సాధారణ విద్యార్థిగా వెళ్లేవాడినని ప్రిన్స్ మహేష్ బాబు తెలిపాడు. నటుల కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని, గౌతమ్కు కూడా ఇది చాలా ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మహేష్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదల కానున్న తొలి చిత్రం శ్రీమంతుడు మూవీ రిలీజ్ కు ముందు కొన్ని జ్ఞపకాలను గుర్తుచేసుకున్నాడు. భార్య నమ్రత తనకు వృత్తిగత జీవితంలో చాలా సాయం చేసిందని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.