మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు | Srimanthudu audio release on July 18 | Sakshi
Sakshi News home page

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు

Published Thu, Jul 9 2015 11:48 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు - Sakshi

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు

మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’గా సిద్ధమవుతున్నారు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆడియో వేడుకపై ఉంది. ఈ నెల 18న ఈ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన  ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ - ‘‘దేవిశ్రీప్రసాద్‌కు ఇది 51వ సినిమా. ఆయన గత సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. కచ్చితంగా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement