Shiva koratala
-
జూనియర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఎన్టీఆర్ 30 క్రేజీ అప్డేట్ ఆరోజే!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ 'ఎన్టీఆర్ 30'. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్‌కు ఊహించని గెస్ట్!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా అదే రోజు సింహాద్రి కూడా రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో జూనియర్ బర్త్ డేకు ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్ ఉండనుంది. కాగా.. ఇటీవలే హైదరాబాద్ జరిగిన షూటింగ్లో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ కోసం వెట్రిమారన్‌తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) #NTR30 Latest Update... pic.twitter.com/TftI6czdI4 — Fukkard (@Fukkard) May 10, 2023 #NTR30 First Look on May 19th and Blood tankers Glimpse on May 20th First Look Target's :- 70K RTs and 300K Likes Glimpse Target :- 500K Likes..( YouTube )#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/FkiKgFn8xg — Anil Tarakian™ ᵛᵃˢᵗᵘⁿⁿᵃ🖤 (@AnilTarakian1) May 15, 2023 -
ఒక్క రోజులో 13 లక్షలు!
స్టార్ హీరోల సిన్మాల కొత్త టీజర్లు, ట్రైలర్లు విడుదలైతే... నెట్టింట్లో హిట్టుల మీద హిట్టులు, లైకుల మీద లైకులు వచ్చేస్తాయి. అదే కొత్త హీరో, హీరోయిన్ నటిస్తున్న సినిమా టీజర్‌ను విడుదలైన ఒక్క రోజులో 13 లక్షలమంది చూశారంటే... ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉందనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ సినిమా థీమ్ టీజర్‌ను దర్శకుడు కొరటాల శివ మంగళవారం విడుదల చేశారు. నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఒక్క రోజులో టీజర్‌కు 1.3 మిలియన్ వ్యూస్ రావడం హ్యాపీ. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
అలరించిన ఐఫా ఉత్సవం
►జనతా గ్యారేజ్‌కు అవార్డుల పంట ►ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. ఉత్తమ నటి సమంత హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) –2017 సెకండ్ ఎడిషన్ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు చెందిన సెలబ్రిటీలంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో పలువురిని ఐఫా పురస్కారాలతో సత్కరించారు. మార్చి 29న తెలుగు భాషకి సంబంధించి అవార్డుల వేడుకని నిర్వహించగా, ఈ కార్యక్రమానికి రానా, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అఖిల్, సాయిధరమ్ తేజ్, సమంత, రాయ్‌లక్ష్మీ స్టెప్పులతో అలరించారు. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఉత్తమ నటుడి అవార్డును అందుకోగా, సమంత ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అల్లు అర్జున్ రుద్రమదేవి చిత్రానికిగాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకున్నాడు. ►బెస్ట్ మూవీ: జనతా గ్యారేజ్ – యలమంచిలి రవిశంకర్ ►బెస్ట్ స్టోరీ: క్రిష్ – కంచె ►బెస్ట్ డైరెక్షన్: కొరటాల శివ – జనతా గ్యారేజ్ ► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (మేల్): జూ.ఎన్టీఆర్ – జనతా గ్యారేజ్ ► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ లీడింగ్ రోల్ (ఫిమేల్): సమంత – అ..ఆ.. ► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (మేల్): అల్లు అర్జున్ – రుద్రమదేవి ► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ (ఫిమేల్): అనుపమ పరమేశ్వరన్ – ప్రేమమ్ ► బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కామిక్ రోల్: ప్రియ దర్శి – పెళ్లి చూపులు ►బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నెగిటివ్ రోల్: జగపతి బాబు – నాన్నకు ప్రేమతో ► బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీశ్రీ ప్రసాద్ – జనతా గ్యారేజ్ ►బెస్ట్ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (వస్తానే – సోగ్గాడే చిన్నినాయనా) ► బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్): హరిచరణ్ శేషాద్రి (నువ్వంటే నా నవ్వు – కృష్ణగాడి వీరప్రేమ గాథ) ► బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్): గీతా మాధురి (పక్కా లోకల్ – జనతా గ్యారేజ్) ►ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా అవార్డ్: కే రాఘవేంద్ర రావు ఐఫా స్టార్స్.. ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు
మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’గా సిద్ధమవుతున్నారు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆడియో వేడుకపై ఉంది. ఈ నెల 18న ఈ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ - ‘‘దేవిశ్రీప్రసాద్‌కు ఇది 51వ సినిమా. ఆయన గత సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. కచ్చితంగా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అన్నారు.