ఒక్క రోజులో 13 లక్షలు!
స్టార్ హీరోల సిన్మాల కొత్త టీజర్లు, ట్రైలర్లు విడుదలైతే... నెట్టింట్లో హిట్టుల మీద హిట్టులు, లైకుల మీద లైకులు వచ్చేస్తాయి. అదే కొత్త హీరో, హీరోయిన్ నటిస్తున్న సినిమా టీజర్‌ను విడుదలైన ఒక్క రోజులో 13 లక్షలమంది చూశారంటే... ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉందనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ సినిమా థీమ్ టీజర్‌ను దర్శకుడు కొరటాల శివ మంగళవారం విడుదల చేశారు.
నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఒక్క రోజులో టీజర్‌కు 1.3 మిలియన్ వ్యూస్ రావడం హ్యాపీ. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్.