వైశాఖం సూపర్‌ హిట్‌ అవ్వాలి | Cinema industry should be developed to promote new people and talents. | Sakshi
Sakshi News home page

వైశాఖం సూపర్‌ హిట్‌ అవ్వాలి

Jul 1 2017 10:58 PM | Updated on Sep 5 2017 2:57 PM

వైశాఖం సూపర్‌ హిట్‌ అవ్వాలి

వైశాఖం సూపర్‌ హిట్‌ అవ్వాలి

‘‘సినిమా పరిశ్రమ అభివృద్ధి అవ్వాలంటే కొత్త వాళ్లను, ప్రతిభావంతులను ప్రొత్సహించాలి.

– నాగచైతన్య
‘‘సినిమా పరిశ్రమ అభివృద్ధి అవ్వాలంటే కొత్త వాళ్లను, ప్రతిభావంతులను ప్రొత్సహించాలి. అప్పుడు మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. మంచి కథతో వస్తే ‘ఆర్‌.జె. సినిమాస్‌’లో నేను సినిమా చేస్తా’’ అన్నారు హీరో నాగచైతన్య. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’.

ఈ సినిమా థీమ్‌ టీజర్‌ను ఇప్పటి వరకు సుమారు 32 లక్షలమంది చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ వంటి మంచి చిత్రాన్ని చేసిన జయగారికి కంగ్రాట్స్‌. సాంగ్స్‌ విజువల్‌గా బాగున్నాయి. హరీశ్, అవంతిక లుక్స్‌ సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్, పబ్లిసిటీ విషయాల్లో రాజుగారు నాకు, అక్కినేని కుంటుంబానికి ఇచ్చిన సపోర్ట్‌ను మరవలేను’’ అన్నారు.

‘‘ఆర్టిస్టుగా, స్టార్‌గా పైస్థాయికి ఎదుగుతున్న చైతు మా సినిమాకి విషెస్‌ చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ నెలలో సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం అన్నారు’’ బీఏ రాజు. ‘‘కొంతమంది హీరోలను చూసి నప్పుడు మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా ఉంటా డనుకుంటారు. కానీ, నాగచైతన్య మా ఇంట్లో అబ్బాయి లా అనిపిస్తాడు. తను మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు జయ. బి. ఈ చిత్రానికి సహనిర్మాత: అమరనేని నరేష్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి. శివకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement