Vaisakham
-
ఆడవాళ్లంటే వంట చేయడానికే కాదు
‘‘మా గత చిత్రం ‘వైశాఖం’ నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆడియన్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అందరికీ నచ్చింది. అంతకుముందు తీసిన ‘లవ్లీ’ అప్రిషియేషన్స్తో పాటు కమర్షియల్‌గా కూడా మంచి సక్సెస్ అయింది. ‘లక్కీ ఫెలో’ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద íß ట్ అవుతుంది’’ అని దర్శకురాలు జయ బి. అన్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ బి. తన కొత్త చిత్రం వివరాలను, ఇతర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ►ప్రస్తుతం కొత్త సినిమా ‘లక్కీ ఫెలో’ ప్రీ–ప్రొడక్షన్ పనులు చేస్తున్నాం. ఇది ‘వైశాఖం’ అంత లేట్ అవ్వదు. జూన్‌లో స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేస్తాం. మనలో కొంతమందికి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఆ వ్యక్తిని అందరం ‘లక్కీ ఫెలో’ అంటాం. ఈ సినిమాలో హీరో లక్కీ ఫెలో. ఆ లక్‌ను అతను ఎలా తీసుకుంటాడు? అన్నది కథాంశం. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని కథ తయారు చేశాం. ►హీరోయిన్‌ది కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సమాజంలో ఆడవాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగని పెద్దవి ఉండవని కాదు. చిన్న సంఘటన అయినా మానసికంగా బాగా డిస్ట్రబ్ చేస్తుంది. టీనేజ్ అమ్మాయిలకైతే మరీను. హీరోయిన్ ఇలాంటి సెన్స్‌టీవ్ క్యారెక్టర్ని డీల్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ ఈ పాయింట్‌ని టచ్ చేయలేదు. ఇప్పుడున్న యంగ్ హీరో హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటాం. ►నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ నుంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్తో పాటు అండర్ కరెంట్‌లో మెసేజ్ ఉంటుంది. త్వరగా సినిమాలు తీసేసి ఆ తర్వాత జనంలోకి వెళ్లి సమాజానికి ఉపయోగపడే పనులేవైనా చేయాలని ఉంది. నేను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయి, జర్నలిజంలోకి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి. మగాళ్లు ఇంకా ఆడవాళ్లు అప్పడాలు చేయడానికి, వండటానికి మాత్రమే అనుకుంటున్నారు. ఆ ఆలోచనలో మార్పు రావాలి. -
అందుకే ఈ విజయం
– జయ .బి యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీశారని రిలీజ్ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. 8 -
వైశాఖం నా జీవితంలోంచి వచ్చిన సినిమా!
‘ఇప్పటివరకు మేం తీసిన సినిమాల కథలన్నీ సినిమా కోసం సృష్టించినవి. కానీ, ‘వైశాఖం’ అలా కాదు. నా జీవితంలోంచి వచ్చిన సినిమా. కొన్నేళ్ల క్రితం నా లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన చుట్టూ రాసుకున్న కథ ఇది’’ అన్నారు జయ బి. ఆమె దర్శకత్వంలో హరీశ్, అవంతిక ‘వైశాఖం’ హరీశ్, జంటగా బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రకథకు కీలకంగా నిలిచిన ఇన్సిడెంట్ గురించి, ఇతర విశేషాలను జయ ఈ విధంగా పంచుకున్నారు. ఆ ముద్దు సీన్ గురించి ఎవరికీ చెప్పలేదు కొన్ని సీన్స్ తీసేటప్పుడు యూనిట్ మొత్తానికి చెబితే, అలర్ట్ అయిపోయి పని మీద సరిగ్గా దృష్టి పెట్టరు. ఉదాహరణకు ఈ సినిమాలో ఓ కిస్సింగ్ సీన్ ఉంది. హీరో, హీరోయిన్, కెమెరామేన్, నాకు, రాజుగారికి మాత్రమే ఆ సీన్ తీయబోతున్నామని తెలుసు. సీన్లో భాగంగా మాట్లాడుకుంటూ.. హఠాత్తుగా హీరోని హీరోయిన్ ముద్దు పెట్టుకుంటుంది. దాంతో నిజంగానే ఇద్దరూ లవ్‌లో పడ్డారేమోనని యూనిట్ సభ్యులనుకున్నారు. నేను ‘షాట్ ఓకే’ అనగానే, సినిమా కోసమే అలా చేశారని అందరికీ అర్థమైంది. ► అపార్ట్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘వైశాఖం’ తీయాలని ఎందుకు అనిపించింది? ► ఆ మధ్య రాజోలు దగ్గర మా ఊరు వెళ్లినప్పుడు అపార్ట్మెంట్లు కనిపించడం చూసి, షాకయ్యాను. ఈ కల్చర్ కరెక్ట్ కాదనడంలేదు కానీ, కరెక్టయిన వ్యక్తులు ఉన్నప్పుడే అపార్ట్మెంట్ లైఫ్ బాగుం టుంది. లేకపోతే మంచివాళ్లు ఇబ్బందులు పడతారు. అదే ఈ సినిమాలో చూపించాం. లవ్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా తీశాం. ► కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఈ చిత్రకథకు మూలం అన్నారు.. ఏంటా ఇన్సిడెంట్? అమ్మానాన్నా.. నేను, నా ఇద్దరు చెల్లెళ్లు ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. టైమ్ ప్రకారం నీళ్లు వదిలేవాళ్లు. నాన్నగారు హార్ట్ ఎటాక్‌తో చనిపోయినప్పుడు ఇంటి నిండా బంధువులు. అంతిమ క్రియలు జరుపుతున్న సమయంలో వాటర్ లేదు. అడిగితే, టైమ్ ప్రకారమే వదులుతామన్నారు. ఇంటి పెద్ద పోయిన బాధలో ఉన్న మమ్మల్ని ఊరడించాల్సింది పోయి రూల్స్ మాట్లాడారు. ఆ రోజు మేం పడిన బాధను మరచిపోలేను. ఇప్పటివరకూ ఏ సినిమా తీసినా నా మనసులో ఉండిపోయిన ఆ బాధతో సినిమా చేయాలనే ఆలోచన వెంటాడేది. ► మీ నాన్నగారి గురించి... నేను డైరెక్టర్ అయ్యానంటే కారణం ఆయనే. నాన్న (గొట్టిముక్కల నరసింహరాజు) గారికి డైరెక్టర్ అవ్వాలని ఉండేది. కానీ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయారు. నాకు జర్నలిజమ్ అంటే ఇంట్రస్ట్. చెన్నై యూనివర్శిటీలో జర్నలిజమ్‌లో డిప్లొమా చేశాను. ఆ తర్వాత ‘సూపర్ హిట్’ పత్రిక పెట్టి, సక్సెస్ అయ్యాం. నాన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే డైరెక్టర్ అయ్యాను. ఆయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటనతో ‘వైశాఖం’ తీసి, మా అమ్మగారికి అంకితం ఇచ్చాను. ఈ సినిమా చూసి, మా అమ్మగారు ఎమోషన్ అయ్యారు. మంచి సినిమా తీశావని అభినందించారు. ► క్లైమాక్స్ ఎమోషనల్‌గా అనిపించింది.. రమాప్రభగారు ఆ సీన్స్‌లో చేయడానికి ఒప్పుకున్నారా? రమాప్రభగారికి కథ చెప్పినప్పుడు చనిపోయినట్లు చూపించడంతో పాటు అంత్య క్రియలు చేస్తున్నట్లు చూపిస్తా మంటే, ఆమె ఒప్పుకున్నారు. ఆ సీన్ తీసిన రోజు ఆమెకు 104 ఫీవర్. ఆ సీన్ సినిమాకి ఎంత ఇంపార్టెంటో ఆమెకు తెలుసు. అందుకే చేశారు. అద్భుతంగా నటించారు. సాయికుమార్‌గారు ఫైర్ ఆఫీసర్‌గా చేయడం ఓ ప్లస్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన గురించి, క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎమోషనల్‌గా ఉందని చెమర్చిన కళ్లతో అంటున్నారు. ఇన్నేళ్లుగా నన్ను వెంటాడిన సంఘటనను సిల్వర్ స్క్రీన్ మీద చూపించడం, దాన్ని అందరూ అభినందించడం హ్యాపీగా ఉంది. అపార్ట్మెంట్లో నివశిస్తున్న కుటుంబాలు కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పిన మెసేజ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!
– నాగార్జున ‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి 31 ఏళ్లు. రాజు, జయగార్లు అప్పట్నుంచి తెలుసు. మనకున్న అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయగారు ఒకరు. ఆమె ఎప్పుడు కొత్తవాళ్లతో సినిమా లు తీసినా... హిట్టవుతూనే ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే కొత్త కథలు, ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్త చిత్రాలు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యూనిట్ సభ్యులకు షీల్డులు అందించారు. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘రాజుగారి గది–2’ షూటింగ్, మీటింగ్స్‌లో బిజీగా ఉన్నా నాగార్జునగారు ఈ వేడుకకు వచ్చారు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను. ఏయన్నార్‌గారు, నాగార్జునగారు, నాగచైతన్యగారు, అఖిల్... అక్కినేని ఫ్యామిలీ అంతా మాకెప్పట్నుంచో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమాకీ సపోర్ట్ చేశారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాగార్జునగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హైదరాబాద్‌లో మా ఫ్యామిలీ లేదు. బట్, నాగార్జునగారు ఈజ్ మై ఫ్యామిలీ’’ అన్నారు జయ. బి.5 -
వైశాఖంలో కాదు... మైనస్ డిగ్రీస్ చలిలో డ్యాన్స్ చేశా!
‘‘మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు... చీరల్లోనూ అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే వల్గర్‌గా కాకుండా ఎంత అందంగా చూపిస్తారనేది కెమెరామెన్, దర్శకుల చేతుల్లో ఉంటుంది. గ్లామరస్ రోల్స్ చేయడానికి నేను రెడీ. అయితే వల్గర్‌గా ఉండే గ్లామర్ రోల్స్ చేయాలనుకోవడం లేదు’’ అన్నారు హీరోయిన్ అవంతిక. హరీశ్ హీరోగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’లో ఆమే హీరోయిన్. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అవంతిక చెప్పిన విశేషాలు... ⇒ నేను పుట్టింది ఢిల్లీలో. మా నాన్నగారు ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్. తరచూ ట్రాన్స్ఫర్లు కావడంతో ఇండియా మొత్తం తిరిగేశాం. బెంగళూరులోని కాలేజీలో చదువుకున్నాను. కాలేజ్ డేస్‌లో స్పోర్ట్స్ పర్సన్ లేదా పైలట్ అవ్వాలనుకున్నాను. నేను స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే మనసు మార్చుకుని, హీరోయిన్గా ట్రై చేద్దామనుకున్నా.గతంలో నీలకంఠ డైరెక్షన్లో ‘మాయ’ సినిమా చేశాను. ‘వైశాఖం’ నా ఫస్ట్ కమర్షియల్ మూవీ. ⇒ బీఏ రాజుగారు, జయ మేడమ్ నా ఫొటోలు చూసిన రోజే హారీశ్ కాంబినేషన్లో ఫొటోషూట్ చేసి కథ, వినిపించారు. కథ విన్నప్పుడు మంచి క్యారెక్టర్ చేయబోతున్నాననే ఫీల్ కలిగింది. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా భానుమతి క్యారెక్టర్ ఉంటుంది. క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సీన్లో నాకు ఐదు పేజీల డైలాగ్స్ ఉన్నాయి. కొంచెం కష్టమనిపించినా జయగారి ప్రోత్సాహంతో సీన్ కంప్లీట్ చేశాను. చిన్నప్పుడు కథక్ నేర్చుకున్నాను. కానీ ఫిల్మ్ డ్యాన్స్ కష్టం. కజకిస్థాన్‌లో మైనస్ 6 డిగ్రీస్‌లో సాంగ్ షూట్ చేశాం. అదో మంచి ఎక్స్పీరియన్స్. ఏడాదిగా ‘వైశాఖం’ జర్నీ సూపర్. ⇒ నా డ్రీమ్ రోల్వారియర్ ప్రిన్సెస్. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్, మిలటరీ బ్యాక్‌డ్రాప్ ఉన్న పాత్రలంటే ఆసక్తి ఉంది. తమిళంలో ‘నెంజమెల్లామ్ కాదల్’ అనే సినిమా చేస్తున్నా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. -
భానుమతి వలలో...
అసలెప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారా? – హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో కొత్తగా అద్దెకొచ్చిన భానుమతిని ఈ ప్రశ్న వెంటాడింది. వెంటనే ఓ డేరింగ్ స్టెప్ వేసింది. అపార్ట్మెంట్లో పరిచయమైన ఓ అబ్బాయికి వల వేసి, వాడుకోవడం మొదలుపెట్టింది. ఈవిడగారి వాడకం ఎలా ఉందనేది ఈ నెల 21న చూపిస్తామంటున్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిన్మా గురించి బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘అపార్ట్మెంట్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఆల్రెడీ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, థీమ్ టీజర్, డీజే వసంత్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రేజ్ చూసి సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన ‘శ్రీసాయిచంద్ర ఫిల్మ్స్’ నరసింహ విశాఖ కూడా తీసుకున్నారు. ప్రతి ఏరియాకి నలుగురైదుగురు బయ్యర్స్ పోటీ పడుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
వైశాఖం సూపర్ హిట్ అవ్వాలి
– నాగచైతన్య ‘‘సినిమా పరిశ్రమ అభివృద్ధి అవ్వాలంటే కొత్త వాళ్లను, ప్రతిభావంతులను ప్రొత్సహించాలి. అప్పుడు మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. మంచి కథతో వస్తే ‘ఆర్.జె. సినిమాస్’లో నేను సినిమా చేస్తా’’ అన్నారు హీరో నాగచైతన్య. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. ఈ సినిమా థీమ్ టీజర్‌ను ఇప్పటి వరకు సుమారు 32 లక్షలమంది చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ వంటి మంచి చిత్రాన్ని చేసిన జయగారికి కంగ్రాట్స్. సాంగ్స్ విజువల్‌గా బాగున్నాయి. హరీశ్, అవంతిక లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్, పబ్లిసిటీ విషయాల్లో రాజుగారు నాకు, అక్కినేని కుంటుంబానికి ఇచ్చిన సపోర్ట్‌ను మరవలేను’’ అన్నారు. ‘‘ఆర్టిస్టుగా, స్టార్‌గా పైస్థాయికి ఎదుగుతున్న చైతు మా సినిమాకి విషెస్ చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం అన్నారు’’ బీఏ రాజు. ‘‘కొంతమంది హీరోలను చూసి నప్పుడు మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా ఉంటా డనుకుంటారు. కానీ, నాగచైతన్య మా ఇంట్లో అబ్బాయి లా అనిపిస్తాడు. తను మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు జయ. బి. ఈ చిత్రానికి సహనిర్మాత: అమరనేని నరేష్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
... ప్లస్ కౌంటింగ్!
హరీశ్, అవంతిక... తెలుగు తెరకు ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తే. కానీ, వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘వైశాఖం’ థీమ్ టీజర్‌ను యూట్యూబ్‌లో 30 లక్షల మంది చూశారు! రోజు రోజుకీ వ్యూస్ కౌంట్ పెరుగుతోంది కూడా. ‘చంటిగాడు, ప్రేమికుడు, లవ్లీ’ వంటి హిట్ సినిమాలు తీసిన బి. జయ ఈ సినిమాకు దర్శకురాలు కావడంతో కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన ఈ ‘వైశాఖం’ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథతో ఈ సినిమాను రూపొందించామని బీఏ రాజు తెలిపారు. రోజు రోజుకీ తగ్గుతున్న కుటుంబ విలువలు, అనుబంధాలకు ప్రతిబింబంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకురాలు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!
– వీవీ వినాయక్ ‘‘జయగారి సినిమాల్లో హిట్, యావరేజ్ సినిమాలున్నాయి. అయితే, వాటి వల్ల ఎవరికీ ఒక్క రూపాయి నష్టం రాలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... అందరికీ డబ్బులొచ్చే సినిమాలే తీశారు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ పబ్లిసిటీ టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. అలాగే, ఇటీవల విడుదలైన థీమ్ టీజర్ 2.5 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘మహిళా దర్శకురాలు ఎనిమిది సినిమాలు తీయడమంటే తమాషా కాదు. విజయ నిర్మలగారి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు తీసిన ఘనత జయగారిదే. ‘వైశాఖం’ ట్రైలర్, పాటలు బాగున్నాయి. జయగారు తీసిన సినిమాల్లో ‘లవ్లీ’ పెద్ద హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మంచి డేట్, థియేటర్లు లభించిన తర్వాత సినిమాను విడుదల చేయమని సలహా ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు ఎంతో మంచి మనిషి. ఆయన ఈ వేడుకకు రావడం మా అదృష్టం. ప్రేక్షకులు మెచ్చేలా ‘వైశాఖం’ ఉంటుంది’’ అన్నారు బి. జయ. నిర్మాత బీఏ రాజు, హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, నటుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
హిట్ గ్యారెంటీ
– పూరి జగన్నాథ్ ‘‘రాజుగారు, జయగారు మా కుటుంబ సభ్యుల్లాంటివారు. జయగారు ఏ సినిమా తీసినా ఆ సినిమాలోని పాటలు, ట్రైలర్ నాకు చూపిస్తుంటారు. ‘వైశాఖం’ పాటలు చాలా బాగున్నాయి. వసంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ జూన్ ఫస్ట్ వీక్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వైశాఖం’ పాటల్ని పూరి ప్రత్యేకంగా వీక్షించి, మాట్లాడారు. ‘‘హరీశ్, అవంతిక ఫుల్ ఎనర్జిటిక్‌గా పోటీపడి నటించారు. ఇద్దరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. లొకేషన్స్ చాలా కొత్తగా, రిచ్‌గా ఉన్నాయి. విజువల్స్ బ్యూటిఫుల్. ‘వైశాఖం’ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘లవ్లీ’ పాటలు చూసి పూరి జగన్నాథ్‌గారు మమ్మల్ని అభినందించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌కి తన తర్వాతి చిత్రంలో అవకాశమిచ్చారు. పూరీని ఇన్స్పైర్ చేసేలా ‘వైశాఖం’ పాటలు ఉండటం నిజంగా హ్యాపీ’’ అని జయ అన్నారు. ‘‘ పూరీగారు చెప్పినట్టు ‘వైశాఖం’ పెద్ద హిట్ కావడం ఖాయం’’ అన్నారు బీఏ రాజు. -
కనువిందుగా వైశాఖం పాటలు – దేవిశ్రీ ప్రసాద్
హరీష్, అవంతిక జంటగా సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’. జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డీజే వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ పాటలు బాగా నచ్చాయి. కంగ్రాట్స్ టు వసంత్. ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ చాలా బాగా నచ్చింది.జయగారి టేకింగ్ బాగుంది. ఆడియో, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. రాజుగారు అందరికీ కావాల్సిన మనిషి. జయగారు మాకెంతో ఆత్మీయులు. ‘వైశాఖం’ ఆమె కెరీర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఏ భారతీయ చిత్రం షూట్ చెయ్యని కజకిస్తాన్‌లోని అరుదైన లొకేషన్స్‌లో పాటలు తీశారు. అలాంటి రేర్ లొకేషన్స్‌ని స్క్రీన్‌పై చూడడం చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ‘వైశాఖం’ పాటలు చూసి, మమ్మల్ని అభినందించిన దేవిశ్రీగారికి కృతజ్ఞతలు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నాం. దేవిశ్రీ చెప్పినట్టుగానే పాటలు, సినిమా పెద్ద హిట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అని బి.ఎ.రాజు అన్నారు. -
భానుమతి పోగొట్టింది
భానుమతిని చూసిన తర్వాత ఓ కుర్రాడి మతిపోయింది. అంత అందంగా ఉంటుంది మరి! రూపమే కాదు... భానుమతి మనసూ అందమే. ఇద్దరూ ఓ అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్స్‌లో ఉంటారు. కానీ, ఇతడంటే ఆమెకు సరైన అభిప్రాయం ఉండదు. అటువంటిది అతడితో ప్రేమలో పడుతుంది. అసలేం జరిగింది? వీళ్ళిద్దరి కథేంటి? అనేది వేసవికి వస్తున్న మా ‘వైశాఖం’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకురాలు బి. జయ. హరీశ్, అవంతిక జంటగా ఆర్జే సినిమాస్ పతాకంపై బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఇటీవల మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదలైన మా ‘వైశాఖం’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే యూనివర్శల్ కథతో జయ ఈ సినిమా తీశారు. సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘బీఏ రాజు, బి. జయ కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. ఈ సినిమా పాటలూ మంచి హిట్టయ్యాయి. త్వరలో ‘వైశాఖం’ ప్లాటినం డిస్క్ వేడుక నిర్వహిస్తాం’’ అని ‘ఆదిత్య’ మ్యూజిక్ ఉమేశ్ గుప్తా అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బీఏ రాజు గారు ఒకరు. ఆయనకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటా. ‘వైశాఖం’ పాటలు, విజువల్స్ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్, అవంతిక, మొత్తం టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. డి.జె. వసంత్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు రిలీజ్ చేసి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అందించారు. జయ బి. మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ మహేశ్‌బాబే. ఆయన మా చిత్రం పాటల విడుదలకు రావడంతో ఈ ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. మహేశ్‌బాబు, మురుగదాస్ డైరెక్షన్లో రానున్న చిత్రం ఇండియా రికార్డులన్నీ క్రాస్ చేయాలన్నదే నా ఫస్ట్ కోరిక’’ అన్నారు. ‘‘మహేశ్‌బాబుది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా ఆరు సినిమాల ఆడియో రిలీజ్ చేశాం. అన్నీ హిట్టయ్యాయి. ఏడో సినిమా కూడా సక్సెస్ ఖాయం. ఫోన్ చేయగానే వచ్చిన త్రివిక్రమ్, వంశీ పైడిపల్లిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు బీఏ రాజు. ‘‘చైత్రమాసంలో వసంత రుతువు, ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుందని చిన్నప్పుడు చదువుకున్నాం. ‘వైశాఖం’ వంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీ. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు త్రివిక్రమ్. నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వై. రవిశంకర్, హరీష్, అవంతిక, డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్ బి. శివ కుమార్, ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా, నిరంజన్ పాల్గొన్నారు. ‘భరత్ అనే నేను’ ఫిక్స్ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ‘‘భరత్ అనే నేను’కి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ‘భరత్ అనే నేను’ టైటిల్‌ని ఫిక్స్ చేశారని అర్థమవుతోంది. -
శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి
‘‘కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో మా ‘వైశాఖం’ చిత్రీకరణ ప్రారంభమైంది. సరిగ్గా శివరాత్రికి చిత్రీకరణ పూర్తయింది’’ అని నిర్మాత బీఏ రాజు అన్నారు. హరీష్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వైశాఖం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాజు మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ ఓవర్సీస్ రైట్స్‌ను బ్లూ స్కై సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల నుంచి బయ్యర్స్ చాలామంది వస్తున్నారు. స్పీడ్‌గా బిజినెస్ అవుతోంది’’ అన్నారు. ‘‘కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తం గా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం ఉన్న మా సినిమా శివరాత్రికి పూర్తవడం విశేషం. మంచి ఫీల్‌గుడ్ మూవీ ఇది’’ అని బి. జయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె. వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్. -
వేసవిలో వైశాఖం
వైశాఖంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి–పద్మావతిల కల్యాణం జరిగింది. అందుకే, ఈ మాసంలో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఎంతో ప్రాముఖ్యత, పవిత్రత గల ఈ ‘వైశాఖం’ పేరుతో బి. జయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ – ‘‘ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఓ అబ్బాయి లైఫ్‌లో ‘వైశాఖం’లా ప్రవేశించిన ఓ అమ్మాయి, అతడి లైఫ్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వీరి ప్రేమ పెళ్లి వరకూ ఎలా వెళ్లిందనేది సినిమా’’ అన్నారు. ‘‘మా సంస్థ తీసిన ప్రేమకథా చిత్రాలన్నీ హిట్టయ్యాయి. కుటుంబ నేపథ్యంలో తీసిన ఈ ప్రేమకథా చిత్రం కూడా హిట్టవుతుంది’’ అన్నారు బీఏ రాజు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
‘ఇది కొత్త తరహా చిత్రం’
‘‘నాన్నగారి మరణం నన్ను చాలా విషయాల్ని ఆలోచించేలా చేసింది. అప్పుడీ కథ రాశా. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగిందని సర్ప్రైజ్ అవుతారు’’ అన్నారు దర్శకురాలు బి. జయ. హరీశ్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. వచ్చే నెలలో ఆడియో, వేసవిలో సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న బి. జయ మాట్లాడుతూ – ‘‘హీరో నివసించే అపార్ట్మెంట్లో దిగిన హీరోయిన్ అతణ్ణి ఎలా మార్చింది? ఆమె ఉద్దేశం ఏంటనేది కథ. అపార్ట్మెంట్లో కుటుంబాలన్నీ కలిసుంటే ఎంత అందంగా ఉంటుందనేది సినిమాలో చెబుతున్నాం. కజికిస్థాన్‌లో తీసిన పాటలు హైలైట్. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు ఓ ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. కొత్త తరహా చిత్రమిది’’ అన్నారు. -
రెండు... మూడేళ్లే అయినట్టుంది!
‘‘ఓ నిర్మాతగా సినిమాలోని కథకు న్యాయం చేస్తూ, కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడీ ‘వైశాఖం’ కూడా కథే మెయిన్ హీరోగా నడిచే సినిమా. మా సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటిలోనూ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. నేడు నిర్మాత బీఏ రాజు పుట్టినరోజు. ఆయన మట్లాడుతూ – ‘‘విలేకరిగా ప్రయాణం ప్రారంభించి, పీఆర్వోగా, పత్రికాధినేతగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నాను. నా విజయం వెనుక నా సతీమణి బి. జయ మద్దతు ఎంతో ఉంది. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కెరీర్ స్టార్ట్ చేసి రెండు మూడేళ్ళే అయినట్టుంది. ప్రతిరోజూ చేసే పనిని ఇష్టంగా చేయడం నా పాలసీ. ‘వైశాఖం’ చిత్రానికి వస్తే ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ మా సంస్థ నిర్మించిన సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురావడంతో ‘వైశాఖం’ బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా ప్రారంభిస్తా’’ అన్నారు. -
ఏడేళ్లు... వంద సినిమాలు
నటులు దర్శకులు కావడం కామన్. కానీ, దర్శకుడు పూర్తి స్థాయి నటుడు కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘నువ్వులేక నేను లేను’, ‘తొలి చూపులోనే’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వై.కాశీ విశ్వనాథ్ ‘నచ్చావులే’ చిత్రంతో నటుడిగా మారారు. అప్పటి నుంచి పలు పాత్రల్లో నటించిన ఆయన తాజాగా చేస్తున్న ‘వైశాఖం’తో వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు విశ్వనాథ్. ఆయన మాట్లాడుతూ- ‘‘నటునిగా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆరేడేళ్లలో నేను వంద చిత్రాలు చేశానంటే ఆ క్రెడిట్ దర్శకులు, నిర్మాతలు, రచయితలకు దక్కుతుంది. వారు అవకాశం ఇవ్వబట్టే ఇన్ని చిత్రాల్లో నటించగలిగాను. సీరియల్స్‌లో చేయమని అడిగారు, కానీ అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘వైశాఖం’లో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నా గెటప్, మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. హీరోతో ఎక్కువ సన్నివేశాలుంటాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇది నా నూరవ సినిమా కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
`వైశాఖం `మూవీ స్టిల్స్
-
వైశాఖం...హార్ట్ టచింగ్
‘‘నాకు కుటుంబమంటే ఇష్టం. స్నేహితులంటే చాలా ఇష్టం. అనుబంధాలకు చాలా విలువ ఇచ్చే వ్యక్తిని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జయగారు ఓ అద్భుతమైన కథ రాశారు. అందులో షార్ట్ అండ్ స్వీట్ రోల్లో నటించమనగానే అంగీకరించా. గుర్తుండే పాత్ర అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వైశాఖం’. బి.జయ మాట్లాడుతూ - ‘‘ప్రతి సన్నివేశాన్ని పండగ వాతావరణంలో చిత్రీకరించాం. బాడీ గింబల్ టెక్నాలజీతో షూట్ చేశాం. ఇప్పుడు ‘2.0’కి శంకర్ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ -‘‘జయ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందీ చిత్రం. తనకు గొప్ప పేరు తీసుకొస్తుంది. లవ్, కామెడీ, ఎమోషన్, చిన్న మెసేజ్ ఉన్న హార్ట్ టచింగ్ మూవీ. కన్నడలో 9, తెలుగులో 6 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సాయికుమార్‌గారు మాపై అభిమానంతో సినిమా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ పాల్గొన్నారు. -
చిన్న చిత్రాల్లో కొత్త ట్రెండ్ : బీఏ రాజు
‘‘ప్రేమ, వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. చిన్న చిత్రాల్లో మా ‘వైశాఖం’ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ - ‘‘అపార్ట్మెంట్స్ నేపథ్యంలో రూపొందించిన కుటుంబ కథా చిత్రమిది. ‘వైశాఖం’ పేరులో ఎంత మంచి ఫీల్ ఉందో.. సినిమా కూడా అంతే మంచి ఫీల్ ఇస్తుంది. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొత్త కథలతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో మా చిత్రం చేరుతుంది. రెండు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
తాతగారే నాకు స్ఫూర్తి!
ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. తనదైన శైలిలో సంగీతం అందిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డీజే వసంత్. ‘మడత కాజా’, ‘సుడిగాడు’, ‘స్పీడున్నోడు’ తదితర చిత్రాలకు పాటలు స్వరపరిచారు. తాజాగా ‘వైశాఖం’ చిత్రానికి సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వసంత్ మాట్లాడుతూ- ‘‘తాతగారి ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీకి వచ్చా. నా పదహారేళ్ల ఇండస్ట్రీ లైఫ్‌లో శ్రీ, మణిశర్మ, హ్యారిస్ జయరాజ్, ఆర్పీ పట్నాయక్ తదితరుల దగ్గర పనిచేశా. కెరీర్ ప్రారంభంలో కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశా. ‘నా గత చిత్రాల కంటే ‘వైశాఖం’ మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చావు. నేను ఫుల్ హ్యాపీ’ అని డెరైక్టర్ బి. జయ అన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్, మంచు మనోజ్ చిత్రాలతో పాటు మరో నాలుగు చిత్రాలకు సంగీతం అందిస్తున్నా’’ అన్నారు. బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ త్వరలో విడుదల కానుంది. -
అందరికీ నచ్చేలా వైశాఖం
మహిళా దర్శకుల్లో ‘డైనమిక్’ అనిపించుకున్న వాళ్లల్లో జయ బి. ఒకరు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. ఈ నెల 20న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. జయ బి. మాట్లాడుతూ- ‘‘నైట్ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్, కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నాం. సరికొత్త కథాంశంతో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌తో పాటు అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు. ‘‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్లో తెరకెక్కిస్తున్నాం. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని బీఏ రాజు చెప్పారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్.