భానుమతి పోగొట్టింది | new telugu movie vaisakam | Sakshi
Sakshi News home page

భానుమతి పోగొట్టింది

Published Sat, Apr 1 2017 1:13 AM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

భానుమతి పోగొట్టింది - Sakshi

భానుమతి పోగొట్టింది

భానుమతిని చూసిన తర్వాత ఓ కుర్రాడి మతిపోయింది. అంత అందంగా ఉంటుంది మరి! రూపమే కాదు... భానుమతి మనసూ అందమే. ఇద్దరూ ఓ అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్స్‌లో ఉంటారు. కానీ, ఇతడంటే ఆమెకు సరైన అభిప్రాయం ఉండదు. అటువంటిది అతడితో ప్రేమలో పడుతుంది. అసలేం జరిగింది? వీళ్ళిద్దరి కథేంటి? అనేది వేసవికి వస్తున్న మా ‘వైశాఖం’ చూసి తెలుసుకోమంటున్నారు దర్శకురాలు బి. జయ. హరీశ్, అవంతిక జంటగా ఆర్‌జే సినిమాస్‌ పతాకంపై బి. జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటించారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఇటీవల మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదలైన మా ‘వైశాఖం’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే యూనివర్శల్‌ కథతో జయ ఈ సినిమా తీశారు. సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘బీఏ రాజు, బి. జయ కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్సే. ఈ సినిమా పాటలూ మంచి హిట్టయ్యాయి. త్వరలో ‘వైశాఖం’ ప్లాటినం డిస్క్‌ వేడుక నిర్వహిస్తాం’’ అని ‘ఆదిత్య’ మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్, సంగీతం: డీజే వసంత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement