వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు | Vaisakham audio released on Golden Hands of Mahesh Babu | Sakshi
Sakshi News home page

వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు

Published Thu, Mar 16 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు

వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బీఏ రాజు గారు ఒకరు. ఆయనకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటా. ‘వైశాఖం’ పాటలు, విజువల్స్‌ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్, అవంతిక, మొత్తం టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. డి.జె. వసంత్‌ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు రిలీజ్‌ చేసి, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి అందించారు.

 జయ బి. మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబే. ఆయన మా చిత్రం పాటల విడుదలకు రావడంతో ఈ ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. మహేశ్‌బాబు, మురుగదాస్‌ డైరెక్షన్‌లో రానున్న చిత్రం ఇండియా రికార్డులన్నీ క్రాస్‌ చేయాలన్నదే నా ఫస్ట్‌ కోరిక’’ అన్నారు. ‘‘మహేశ్‌బాబుది గోల్డెన్‌ హ్యాండ్‌. ఆయన చేతుల మీదుగా ఆరు సినిమాల ఆడియో రిలీజ్‌ చేశాం.

 అన్నీ హిట్టయ్యాయి. ఏడో  సినిమా కూడా సక్సెస్‌ ఖాయం. ఫోన్‌ చేయగానే వచ్చిన త్రివిక్రమ్, వంశీ పైడిపల్లిగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు బీఏ రాజు. ‘‘చైత్రమాసంలో వసంత రుతువు, ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుందని చిన్నప్పుడు చదువుకున్నాం. ‘వైశాఖం’ వంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీ. ఈ చిత్రం సక్సెస్‌ అవ్వాలి’’ అన్నారు త్రివిక్రమ్‌. నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వై. రవిశంకర్, హరీష్, అవంతిక, డీజే వసంత్, లైన్‌ ప్రొడ్యూసర్‌ బి. శివ కుమార్, ఆదిత్య మ్యూజిక్‌ ఆదిత్య గుప్తా, నిరంజన్‌ పాల్గొన్నారు.

‘భరత్‌ అనే నేను’ ఫిక్స్‌
మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ ‘‘భరత్‌ అనే నేను’కి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు. దీన్నిబట్టి చూస్తే ‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారని అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement