Director Trivikram Srinivas
-
త్రివిక్రమ్ తో తారక్ చర్చలు..!
-
నాలుగోసారి...
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా తెర కెక్కనుంది. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అల..వైకుంఠపురములో..’ (2020) చిత్రాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా ప్రకటన వెల్లడైంది. పద్మశ్రీ అల్లు రామలింగయ్య–మమత సమర్పణలో హారిక–హాసినీ క్రియేషన్్స, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోమవారం గురుపూర్ణిమ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రక టించారు. ‘ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని టాక్. -
మహేష్ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ బిగ్ సర్ప్రైజ్
-
సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ తొలగింపు
-
చరణ్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నత్రివిక్రమ్ ?
-
నిర్మాతగా బిజీ అవుతున్నత్రివిక్రమ్
-
త్వరలో మహేశ్‌బాబు నూతన గృహప్రవేశం.. త్రివిక్రమ్ కూడా..
త్వరలో మహేశ్‌బాబు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చెయనున్నారట. మహేశ్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టనున్నారట. ఇది సినిమా ఇల్లు అని అర్థం అయింది కదూ. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఓ పెద్ద ఇంటి సెట్‌ను వేయించాలనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ఇంటి డిజైన్, స్పేస్ వగైరా వంటి అంశాల గురించి ఈ చిత్ర ఆర్ట్డైరెక్టర్తో త్రివిక్రమ్ చర్చిస్తున్నారట. అన్నీ సవ్యంగా జరిగి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ఇంటి సెట్లో చిత్రీకరణ ఆరంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కీలక పాత్రలకు సుమంత్, శిల్పా శెట్టిల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి... వీరిలో ఎవరు నటిస్తారు? అనేది చూడాలి. మరోవైపు మహేశ్ తాజా చిత్రం ‘సర్కారువారి పాట’కి సంబంధించిన అప్డేట్ ఈ నెల 31 (మహేశ్ తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా)న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు మహేశ్ ఫస్ట్‌లుక్ విడుదలవుతుందని సమాచారం. -
ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్!
కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. మరికొందరు ఏకంగా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తుంటారు. కానీ హీరో కథ మెచ్చి ప్రాజెక్టు ఓకే అయిన తర్వాతే హీరోయిన్ ఎవరన్నదాని గురించి ఆలోచిస్తారు. పైగా కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలే లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి హీరోయిన్లను రంగంలో దింపుతారు. ముఖ్యంగా ఆల్రెడీ చేసిన హీరోయిన్లతో కాకుండా వేరేవాళ్లను తీసుకునేందుకే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అంతే! తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ కాకుండా చూసుకుంటాడు. కానీ ఓ బేబీ బ్యూటీ సమంతకు మాత్రం మూడు అవకాశాలిచ్చాడు. (చదవండి: వెయ్యి మంది... వంద రోజులు!) తర్వాత గోవా బ్యూటీ ఇలియానా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా రెండింటితోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా పూజాకు మరోసారి త్రివిక్రమ్ సినిమాలో మెరిసే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా పూజా ఇప్పటికే త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు), అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది. (చదవండి: నలుగురు హీరోయిన్లతో ‘పిట్ట కథలు’.. టీజర్ ఇదిగో) -
మామా... ఎక్కడున్నావ్!?
మామ కోసం హీరో పవన్ కల్యాణ్ వెయిటింగ్! దాంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన్ను వెతికే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబయ్, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ ఎక్కడ ఉన్నాడో చూడమని చెప్పారట. ఎవరీ మామ? అంటే పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాలో ఓ క్యారెక్టర్ ఉందట! హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్ అండ్ కో తెగ వెతుకుతున్నారట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్ డైరెక్టర్స్ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. మరి, మమ్ముట్టి ఏమంటారో!! మామ పాత్రకు ఎవరూ సెట్ కాకపోవడం వల్లే షూటింగ్‌కు చిన్న గ్యాప్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. అన్నట్టు... ఈ సిన్మాలో ఖుష్బు పవన్‌కు అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ అట! -
వైశాఖం పాటలు బాగున్నాయి : మహేశ్‌బాబు
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు బాగా కావాల్సిన వ్యక్తుల్లో బీఏ రాజు గారు ఒకరు. ఆయనకెప్పుడూ మంచి జరగాలని కోరుకుంటా. ‘వైశాఖం’ పాటలు, విజువల్స్ చాలా బాగున్నాయి. జయగారికి, హరీష్, అవంతిక, మొత్తం టీమ్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. డి.జె. వసంత్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు రిలీజ్ చేసి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అందించారు. జయ బి. మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి తర్వాత మాకు సౌత్ ఇండియా సూపర్‌స్టార్ మహేశ్‌బాబే. ఆయన మా చిత్రం పాటల విడుదలకు రావడంతో ఈ ఫంక్షన్‌కి ఒక కళ వచ్చింది. మహేశ్‌బాబు, మురుగదాస్ డైరెక్షన్లో రానున్న చిత్రం ఇండియా రికార్డులన్నీ క్రాస్ చేయాలన్నదే నా ఫస్ట్ కోరిక’’ అన్నారు. ‘‘మహేశ్‌బాబుది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా ఆరు సినిమాల ఆడియో రిలీజ్ చేశాం. అన్నీ హిట్టయ్యాయి. ఏడో సినిమా కూడా సక్సెస్ ఖాయం. ఫోన్ చేయగానే వచ్చిన త్రివిక్రమ్, వంశీ పైడిపల్లిగార్లకు థ్యాంక్స్’’ అన్నారు బీఏ రాజు. ‘‘చైత్రమాసంలో వసంత రుతువు, ఆ తర్వాత వైశాఖ మాసం వస్తుందని చిన్నప్పుడు చదువుకున్నాం. ‘వైశాఖం’ వంటి మంచి టైటిల్‌తో సినిమా చేయడం హ్యాపీ. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు త్రివిక్రమ్. నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, వై. రవిశంకర్, హరీష్, అవంతిక, డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్ బి. శివ కుమార్, ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా, నిరంజన్ పాల్గొన్నారు. ‘భరత్ అనే నేను’ ఫిక్స్ మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ‘‘భరత్ అనే నేను’కి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే ‘భరత్ అనే నేను’ టైటిల్‌ని ఫిక్స్ చేశారని అర్థమవుతోంది.