హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా తెర కెక్కనుంది. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అల..వైకుంఠపురములో..’ (2020) చిత్రాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా ప్రకటన వెల్లడైంది. పద్మశ్రీ అల్లు రామలింగయ్య–మమత సమర్పణలో హారిక–హాసినీ క్రియేషన్్స, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.
సోమవారం గురుపూర్ణిమ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రక టించారు. ‘ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ బ్యాక్
డ్రాప్లో ఉంటుందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment