కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే! | "Vaisakham movie will be Release tomorrow | Sakshi
Sakshi News home page

కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!

Published Thu, Jul 20 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!

కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!

– నాగార్జున
‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి 31 ఏళ్లు. రాజు, జయగార్లు అప్పట్నుంచి తెలుసు. మనకున్న అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయగారు ఒకరు. ఆమె ఎప్పుడు కొత్తవాళ్లతో సినిమా లు తీసినా... హిట్టవుతూనే ఉన్నాయి. ట్రెండ్‌ చూస్తుంటే కొత్త కథలు, ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

కొత్త చిత్రాలు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యూనిట్‌ సభ్యులకు షీల్డులు అందించారు.

బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘రాజుగారి గది–2’ షూటింగ్, మీటింగ్స్‌లో బిజీగా ఉన్నా నాగార్జునగారు ఈ వేడుకకు వచ్చారు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను. ఏయన్నార్‌గారు, నాగార్జునగారు, నాగచైతన్యగారు, అఖిల్‌... అక్కినేని ఫ్యామిలీ అంతా మాకెప్పట్నుంచో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమాకీ సపోర్ట్‌ చేశారు. ఆయనకు స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నాగార్జునగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హైదరాబాద్‌లో మా ఫ్యామిలీ లేదు. బట్, నాగార్జునగారు ఈజ్‌ మై ఫ్యామిలీ’’ అన్నారు జయ. బి.5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement