Avantika
-
Avantika: అద్భుతం.. అవంతిక నృత్యం
కూచిపూడి, భరతనాట్యం, జానపదం, కథకళి, కథక్, మణిపురి, ఒడిస్సీ, మోహినీ అట్టం, యక్షగానం ప్రముఖమైన నృత్యకళలు. వీటిలో భరత నాట్యానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయాల్లో కనిపించే శిల్పాలు భరతనాట్య భంగిమలో దర్శనమిస్తాయి. తంజావూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భరతనాట్యమంటే అందరికీ ఇష్టమే. భరతనాట్య కళాకారులకు గుర్తింపు, గౌరవం కూడా ఎక్కువే. అలాంటి గుర్తింపు, గౌరవాన్ని చిన్న వయసులోనే సొంతం చేసుకుంది మార్కాపురానికి చెందిన చిన్నారి అవంతిక. మార్కాపురం: కళలపై అభిరుచి ఉన్న తలిదండ్రులు తమ పిల్లలను ప్రముఖ కళాకారులుగా చూడాలని కోరుకుంటారు. మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి దంపతులు కూడా తమ కుమార్తె అవంతికను నాట్య కళాకారిణిగా చూడాలని భావించారు. ఐదేళ్ల వయసు నుంచే నాట్య గురువు ప్రతిమ దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నారు. 2016లో ప్రారంభమైన నృత్య శిక్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. మార్కాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి గడిచిన ఏడేళ్లలో సొంతూరితోపాటు ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా నరసింహ కౌతువం ప్రదర్శనలో అవంతిక నాట్యం అద్భుతమని చెప్పవచ్చు. ఇందులో హావభావాలు, ముఖ కవళికలను చూసి తీరాల్సిందే. 2022లో మలేíÙయా, 2023లో శ్రీలంక, ఈ ఏడాది ఏప్రిల్‌లో దుబాయ్‌లోనూ నృత్య ప్రదర్శనలిచ్చిన అవంతిక అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు అందుకుంది. అంతే కాదండోయ్.. చదువులో కూడా అవంతిక క్లాస్ ఫస్టే. మరొక విశేషమేమిటంటే అవంతిక సంగీతంలోనూ శిక్షణ తీసుకుంటోంది.గెలుపొందిన అవార్డులు ⇒ 2020లో నిర్వహించిన జాతీయ నృత్య ఉత్సవాల్లో పాల్గొని నంది పురస్కారం అందుకుంది. ⇒ 2021లో హంపిలో నిర్వహించిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలో అంజనా పురస్కారం, ధూర్జటి పురస్కారం, నాట్యమయూరి పురస్కారం పొందింది. ⇒ 2022లో జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది. డివిజన్ స్థాయి ఐకాన్ అవార్డు పొందింది. అలాగే బాల నాట్య నర్తకీమణి, నర్తన నంది, గజకేశరి పురస్కారాలు పొందింది. ⇒ కాళహస్తిలో నిర్వహించిన నృత్య పోటీలో ప్రథమ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ⇒ రాజమండ్రిలో నిర్వహించిన పోటీల్లో రెండో స్ధానం, శ్రీశైలంలో నిర్వహించిన జాతీయ స్ధాయిలో మూడో స్ధానంలో నిలిచింది. ⇒ 2023లో అంతర్జాతీయ స్ధాయిలో సూపర్ చాంపియన్‌గా ఎంపికైంది. నాట్యం, సంగీతం చాలా ఇష్టం మా అమ్మాయి అవంతికకు నాట్యమంటే ఇష్టమని గమనించి నాట్య గురువు ప్రతిమ వద్ద 2016లో శిక్షణలో చేరి్పంచాం. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రేక్షకులను మెప్పించి బహుమతులు సాధించింది. ఈ మధ్య సంగీతం కూడా నేర్చుకుంటోంది. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ చదువులో కూడా ఫస్ట్ వస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన కళల్లో శిక్షణ ఇప్పించి ప్రోత్సహిస్తే సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించినవారవుతారు. మానసిక ఆనందంతోపాటు గౌరవం కూడా లభిస్తుంది. – భూపని కాశయ్య, అన్నపూర్ణాదేవి -
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే 2011లోనే అవంతిక మాలిక్‌ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్‌తో వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్‌కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు. -
తెలుగుమ్మాయిని.. సపోర్ట్ చేయాలి కానీ ట్రోలింగ్..: అవంతిక
అవంతిక వందనపు.. ఈ మధ్య బాగా మార్మోగిపోతున్న పేరు. 'బ్రహ్మోత్సవం' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇందులో మహేశ్‌బాబు చెల్లిగా కనిపించిన అవంతిక తర్వాత 'మనమంతా', 'ప్రేమమ్' సినిమాల్లో కనిపించింది. అలా తెలుగులో బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన ఈమె 2021లో హీరోయిన్గా స్పిన్ అనే మూవీ చేసింది. అప్పటినుంచి అన్నీ హాలీవుడ్ సినిమాలే చేస్తోంది. ఇటీవలే మీన్ గర్ల్స్ అనే చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అవంతిక అమెరికా యాక్సెంట్లో మాట్లాడటంతో చాలామంది తనను ట్రోల్ చేశారు. పదేళ్ల వయసులో.. దీనిపై అవంతిక స్పందిస్తూ.. 'అమ్మది హైదరాబాద్, నాన్నది నిజామాబాద్.. కానీ నేను పుట్టిపెరిగింది అమెరికాలో! నాకు 10 ఏళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. ఇక్కడికి వచ్చాక సినిమా అవకాశాలు రావడంతో ఐదేళ్లు ఇక్కడే ఉన్నాం. అమ్మ నాకోసమే ఉద్యోగం వదిలేసింది. నేను అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో నాకే అర్థం కావడం లేదు. నేను అక్కడే పుట్టిపెరిగాను కాబట్టి నాకు యాస అలాగే వస్తుంది. తెలుగమ్మాయి హాలీవుడ్లో సక్సెస్ అవుతుందంటే సపోర్ట్ చేయాలి కానీ ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. హీరోయిన్గా.. ట్రోల్స్‌ను మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం. కానీ ఇంత దారుణమైన ట్రోలింగ్‌ను నేనింతవరకు చూడలేదు. అయితే అమెరికాలో నెపోటిజం లేదు. టాలెంట్‌ను బట్టే ఛాన్సులు ఇస్తారు. కానీ నాకు ఇక్కడ హీరోయిన్గా రాణించాలనుంది. సౌత్‌లో, బాలీవుడ్లో సినిమాలు చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది. అవంతిక నటించిన 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె యాక్ట్ చేసిన హాలీవుడ్ హారర్ మూవీ 'టారో' సమ్మర్లో రిలీజ్ కానుంది. చదవండి: ఏడాదికే భార్యకు విడాకులు.. హీరోయిన్‌తో నటుడి రెండో పెళ్లి -
నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిన నటి కుష్బూ. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి, టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విక్టరీ వెంకటేశ్ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్ అందరితో ఖుష్బూ కలిసి నటించారు. తమిళనాడు అభిమానులు ఆమెకు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్భూకు అక్కడ ఏ స్థాయి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడి 1991లో అతన్ని వివాహం చేసుకుంది.వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పేర్లు అవంతిక, అనంతిక. వీరి పిల్లల గురించి చాలా మందికి తెలియదు. పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుంది. సోషల్ మీడియాలో అవంతిక చాలా ఫాలోయింగ్ ఉంది. తరచు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అవంతికి చూడడానికి అచ్చం సినిమా హీరోయిన్లా చాలా అందంగా ఉంటుంది. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. లండన్‌లో స్టడీస్ పూర్తయిన వెంటనే ఆమె సినిమాల్లోకి వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సినిమాల్లోకి వస్తే మాత్రం తన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాలను పక్కకి పెట్టి అవంతిక ఫోటోలనే ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
Avantika Mishra : అవంతిక మిశ్రా లేటెస్ట్ ఫొటోస్
-
నేను స్టూడెంట్ సార్ అనేవాణ్ణి
‘‘నేను ప్రతిరోజూ విద్యార్థిలానే భావిస్తాను. ‘నేను స్టూడెంట్ సర్’ టైటిల్ విన్నప్పుడు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు ‘నేను స్టూడెంట్ సార్’ అనేవాణ్ని’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస..’ అనే పాటని విశ్వక్ సేన్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘నేను స్టూడెంట్ సర్’ టీజర్ బాగుంది. సినిమా మంచి హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఫోన్ కొనడానికి కష్టపడే సమయంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ‘24/7 ఒకటే ధ్యాస..’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘‘మా సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాఖీ ఉప్పలపాటి. ‘‘హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా చెప్పాం’’ అన్నారు సతీష్ వర్మ. కథారచయిత కృష్ణ చైతన్య, పాటల రచయిత హర్ష, హీరోయిన్లు అవంతిక, రితిక మాట్లాడారు. -
అభ్యాస అవంతిక
పిల్లల ఆలోచనలు ఎప్పుడూ నేర్చుకునే దశలోనే ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. కానీ, 14 ఏళ్ల అమ్మాయి అవంతిక ఆలోచనలు నేర్పించే దిశగా ఉన్నాయని వారి పెద్దలు ఊహించి ఉండరు. రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల లక్ష్యంగా చేసుకొని ‘సీఖ్’ అని ఓ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది అవంతిక. తనే ఇంట్లో ఓ చిన్నపిల్ల అనుకునే అవంతిక చేసిన ఈ పెద్ద ఆలోచన గురించి తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని అవంతిక కంపాని. సాధారణంగా 13, 14 ఏళ్ల వయసు పిల్లల్లో వ్యాపారాత్మకంగా అంటే బేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుండి క్రీడల వరకు వివిధ డొమైన్లలో ఆలోచనలు చేస్తారు. కానీ, అవంతిక మాత్రం రోజుల బిడ్డ నుంచి మూడేళ్ల వయసు పిల్లల మానసిక అభివృద్ధికి ఏం చేయవచ్చో ఓ ప్రణాళికను రూపొందించింది. చంటి పిల్లల శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం ఇవ్వడంలో జాగ్రత్తలతో పాటు మానసిక ఎదుగుదలకు సహాయపడే అభ్యాసాన్నీ ఇవ్వాలంటుంది. శిశువులు, పసిబిడ్డల కోసం సృష్టించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కిందటేడాదే ప్రారంభించింది అవంతిక. గుర్తించడమే నాంది ఈ శిక్షణా ప్రోగ్రామ్ గురించి తనలో ఆలోచన కలగడానికి గల కారణాల గురించి అవంతిక మాట్లాడుతూ ‘మా కజిన్ కొడుకు ఆరు నెలల వయస్సు వరకు మా ఇంట్లోనే ఉన్నాడు. వాడితో నేను బాగా ఆడుకునేదాన్ని. వాడి చేష్టలు నన్ను బాగా ఆకట్టుకునేవి. ఆ బాబు తన చుట్టూ ఉన్న విషయాల పట్ల ఉత్సుకత, ఉత్సాహంగా చూసే విధానాన్ని గమనించడం ప్రారంభించాను. పిల్లలు తినడం, నిద్రపోవడం, ఏడవడం .. వంటివాటికన్నా ఇంకా ఎన్నో గ్రహించగలరని గుర్తించాను. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వయసు వరకు పిల్లల మెదడు అన్ని వయసుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పరిశోధన ప్రారంభించాను’ అంటోంది అవంతిక. ఇలా ఆలోచించిన అవంతిక శిశువుల మైండ్‌ను ఇంకా చురుగ్గా చేసే సాధనాన్ని అభివృద్ధి చేసింది. మానసిక నిపుణుల సాయం అవంతిక తన ఆలోచనను క్లాస్‌మేట్స్‌తో పంచుకుంది. క్లాస్మేట్ నమితా థాపర్, అతీత్ సంఘవితో పాటు తన బంధువు, కార్పోరేట్ ఉద్యోగి గరిమా జిందాల్‌లు అవంతిక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అంతకుముందు ఈ విషయమ్మీద టీచర్లు, వైద్యులు, పిల్లల మనస్తత్వవేత్తలతో మాట్లాడింది. తాను తెలుసుకున్నది వాస్తవమని గ్రహించాక, 2020 లో ‘సీఖ్’ అనే పరిశోధన ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిజైన్ రూపకల్పన అంశంపై ఆర్టిస్టులతో కలిసి పనిచేసింది. ఇంటరాక్టివ్ ఫ్లాష్కార్డ్లతో ఉండే ఈ ప్రోగ్రామ్‌లో పిల్లల మెదళ్లను ఎలా బలోపేతం చేయాలో తల్లిదండ్రులకు చిట్కాలను అందిస్తుంది అవంతిక. వివరణాత్మక ప్రోగ్రామ్ అవంతిక తన ప్రోగ్రామ్ బాక్స్ గురించి వివరిస్తూ ‘బాక్స్‌లో మొత్తం 72 కార్డులు ఉంటాయి. వీటిని ఆరు భాగాలుగా విభిజించాం. ప్రతి ఒక్క కార్డు పిల్లల మెదడును అభివృద్ధి చేయడానికి, పదును పెరగడానికి సహాయపడుతుంది. ఈ కార్డులు పిల్లల దృష్టిని మరల్చలేవు. వారిలో కొత్త నాడీ కనెక్ష¯Œ లను వృద్ధి చేయడంలో సహాయపడతాయి. వీటిలో పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించే నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ఎంచుకున్నాను. ఆ తర్వాత చుక్కలు పరిమాణాలను సూచిస్తాయి కాబట్టి సంఖ్యను ఎలా రాశారో దానితో అనుసంధానించడానికి బదులుగా, పిల్లవాడు ఆ సంఖ్యను దాని పరిమాణంతో గుర్తిస్తాడు. కార్డ్ టచ్ అండ్ ఫీల్ వల్ల అర్థం చేసుకుంటాడు. ప్రతి ఫ్లాష్ కార్డ్ లో ఒక సర్కిల్ ఉంటుంది. అందులో జనపనార, వెల్వెట్, స్పాంజి, ఇసుక, అట్ట వంటి విభిన్న పదార్థాలను పిల్లలు తాకి అనుభూతి చెందుతారు. ఈ కార్డ్స్‌తో తల్లిదండ్రులు తమ బిడ్డతో ఎలా బంధాన్ని పెంచుకోవచ్చో చిట్కాలు కూడా ఉంటాయి’ అని గలగలా వివరిస్తుంది. బహుమతిగా కార్డు బాక్స్ ఈ కార్డు బాక్స్‌ను తమతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పిల్లలున్నవారికి బహుమతిగా ఇవ్వచ్చు. పిల్లలను బిజీగా ఉంచే ఈ లెర్నింగ్ కార్డుల ప్రాచుర్యానికి అవంతిక తన ఇ¯Œ స్టాగ్రామ్ పేజీని ఉపయోగిస్తుంది. ఆ పేజీ ద్వారా మొదటగా కార్డ్ బాక్స్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లలో ఒకరైన డాక్టర్ మెహతా అవంతికకు తన అభిప్రాయాన్ని పోస్టు చేస్తూ–‘నేను సీక్ ప్యాక్‌ను తీసుకోవడానికి ముందు ఇలాంటివి ఆ¯Œ లై¯Œ లో లభించే ఇతర ఫ్లాష్ కార్డుల మాదిరిగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ, మిగతావాటికన్నా ఇది చాలా భిన్నమైనదని గ్రహించాను. వివిధ రకాల కార్డుల నమూనాలు, రంగులు, ఆకర్షణీయమైన లే అవుట్, పరిశోధించిన కంటెంట్, అల్లికలు.. ఇవన్నీ చూసిన తర్వాత నా ఆరు నెలల కుమార్తెను ఈ కార్డులు బిజీగా ఉంచుతాయని నమ్మాను’ అని తెలిపారు. అవంతిక ఈ కార్యక్రమాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చిన మొదటి మూడు నెలల్లోనే 200కి పైగా యూనిట్ల ప్యాక్స్ అమ్ముడుపోయాయి. చంటిపిల్లల తల్లులు, కిడ్స్ స్కూళ్లు, మూడేళ్ల వయసున్న పిల్లల కుటుంబాలు ఈ ప్యాక్స్‌ను కొనుగోలు చేశాయి. డే వన్ అనే సంస్థ కింద పిల్లలు, శిశు అభివృద్ధికి సహాయపడటానికి మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అవంతిక యోచిస్తోంది. సంగీతం పట్ల మక్కువ ఉండే అవంతిక హిందూస్థానీ క్లాసికల్ ట్యూ¯Œ ్స పిల్లల మెదడు పెరగడానికి ఎలా సహాయపడుతుందనే అంశంపై ఇప్పటికే తన పరిశోధనను ప్రారంభించింది. శిశువుల మానసిక ఎదుగుదలకు సంబంధించిన అంశాల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్న టీనేజర్ అవంతిక నవతరపు ఆలోచనలకు సరికొత్త ప్రతీక. -
విదేశాలకు సముద్రుడు
రమాకాంత్ హీరోగా, భానుశ్రీ, అవంతిక హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో బాదావత్ కిషన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. దాదాపు 25 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో చీరల ఓడరేపు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మూడు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మిగిలిన పాటలను విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ‘‘మా సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చీరాల యం.ఎల్.ఏ ఆమంచి కృష -
విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్ ఖాన్?!
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ భార్య అవంతిక మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘కొన్నిసార్లు మనం దూరంగా నడవాల్సి ఉంటుంది. మీ ద్వారా శక్తి పొందే విషయాలను ఓసారి గమనించాలి. వాటితో పాటు ఉండాల్సిన విషయాన్ని గుర్తెరగాలి. దేనికోసమైతే మన సర్వశక్తులను ఒడ్డామో ఆ స్థానంలో ఏర్పడిన ఖాళీ స్థలాన్ని సైతం స్వాగతించగలగాలి. అయినప్పటికీ వెళ్లక తప్పదని నిర్ణయించుకుంటే మన ముందు ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని గుర్తించాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ క్రమంలో అవంతిక భర్తతో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అవంతిక వేదాంత ధోరణి చూస్తుంటే ఇమ్రాన్‌తో విసిగిపోయినందునే ఇలా నిర్వేదానికి లోనవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇమ్రాన్-అవంతిక గతేడాది నుంచి వేరుగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 2011లో వివాహం చేసుకొన్న ఈ జంట 2014లో ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా, ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా 2015లో ‘కట్టి బట్టి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత ఏడాది దర్శకుడిగా అవతారమెత్తి ‘మిషన్ మార్స్: కీప్ వాకింగ్ ఇండియా’ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి విధిమే. గత కొంత కాలంగా ఇమ్రాన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. -
ప్రాణం ఖరీదు ఎంత?
ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ కథ వినగానే యూనిట్ అందరికీ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు, హైదరాబాద్ 45 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పి.ఎల్.కె. రెడ్డి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అనుకున్నదానికంటే ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి సంగీతం, ఆర్.ఆర్ ఓ హైలైట్’’ అన్నారు. షఫి, ‘జెమిని’ సురేశ్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
అందుకే ఈ విజయం
– జయ .బి యూనివర్సల్ పాయింట్‌తో తీసిన ‘వైశాఖం’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు సెంటిమెంట్ నచ్చింది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైంది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ విజయానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీశారని రిలీజ్ రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ జయ బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. 8 -
కామెడీ థ్రిల్లర్
తెలుగు, హిందీ, మలయాళంలో పలు చిత్రాలకు స్వరాలందించిన సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ కీలక పాత్రలో నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘రావోయి.. మా ఇంటికి’. ఆయనే స్వరకర్త. శ్రీధర్, కావ్యా సింగ్, అవంతిక ముఖ్యతారలు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేసి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు. ‘‘కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కథే మా చిత్రంలో హీరో. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉంటుంది. పాటలు, సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాకేత్ సాయిరామ్. ‘‘కామెడీ చిత్రమైనా నా పాత్రలో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి’’ అన్నారు హీరో శ్రీధర్. అవంతిక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె. దిలీప్ కుమార్ రెడ్డి, డి.కె. గోయల్ పాల్గొన్నారు. -
కొత్తవాళ్లతో జయగారు ఎప్పుడు సినిమా తీసినా హిట్టే!
– నాగార్జున ‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి 31 ఏళ్లు. రాజు, జయగార్లు అప్పట్నుంచి తెలుసు. మనకున్న అతికొద్ది మంది మహిళా దర్శకుల్లో జయగారు ఒకరు. ఆమె ఎప్పుడు కొత్తవాళ్లతో సినిమా లు తీసినా... హిట్టవుతూనే ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే కొత్త కథలు, ఆలోచనలతో వచ్చే దర్శకులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కొత్త చిత్రాలు, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. రేపు విడుదల కానున్న ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యూనిట్ సభ్యులకు షీల్డులు అందించారు. బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘రాజుగారి గది–2’ షూటింగ్, మీటింగ్స్‌లో బిజీగా ఉన్నా నాగార్జునగారు ఈ వేడుకకు వచ్చారు. నేనిది ఎప్పటికీ మర్చిపోలేను. ఏయన్నార్‌గారు, నాగార్జునగారు, నాగచైతన్యగారు, అఖిల్... అక్కినేని ఫ్యామిలీ అంతా మాకెప్పట్నుంచో సపోర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమాకీ సపోర్ట్ చేశారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాగార్జునగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హైదరాబాద్‌లో మా ఫ్యామిలీ లేదు. బట్, నాగార్జునగారు ఈజ్ మై ఫ్యామిలీ’’ అన్నారు జయ. బి.5 -
ఇష్టం+కష్టం= వైశాఖం
‘‘నా గత చిత్రాలకూ, ‘వైశాఖం’కీ చాలా డిఫరెన్స్ ఉంది. కథ–కథనాలు ఎలానూ డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే టేకింగ్ వైజ్‌గా ఎక్కువ టైమ్ తీసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు సినిమాలప్పుడు త్వరగా తీసేయాలని ఒక టైమ్ ఫిక్స్ చేసుకునేదాన్ని. ఈ సినిమాని చాలా కూల్‌గా తీశాను. అవుట్‌పుట్ చూస్తే అది అర్థమవుతుంది’’ అన్నారు జయ. బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో ఆర్. జె సినిమాస్ బ్యానర్‌పై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ. బి చెప్పిన విశేషాలు ♦ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతోంది. అందులో నివసించే వ్యక్తుల మధ్య వచ్చే చిన్న చిన్న క్లాషెస్, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయన్నదే ‘వైశాఖం’ కథ. ఓ వాస్తవ సంఘటనను ఈ సినిమాలో చూపించాం. స్రీన్–ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌తో ఇన్వాల్వ్ అయి ప్రేక్షకులు సినిమాను చూస్తారు. ఒకానొక దశలో సినిమా చూస్తున్న విషయాన్ని మరచిపోయి రియల్ లైఫ్‌లో ట్రావెల్ అవుతున్నట్లుగా ప్రేక్షకులు ఫీలవుతారు. ♦ వైశాఖం’ టఫ్ జర్నీ. ఏడాది జర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశా. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని రాజీ పడకుండా నిర్మించాం. 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులపాటు ట్రావెల్ చేసి, కజికిస్తాన్లో సాంగ్స్ షూట్ చేశాం. అక్కడ మూడు రోజులకొకసారి పాస్‌పోర్ట్ స్టాంపింగ్ చేయించుకోకపోతే మూడు నెలల జైలు తప్పదు. బడ్జెట్, శ్రమ ఎక్కువైనప్పటికీ లొకేషన్స్ బాగుండటంతో రిస్క్ చేశాం. ♦ నా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. కజికిస్తాన్లో సాంగ్స్ తీస్తే బాగుంటుందనుకున్నప్పుడు బడ్జెట్ ఎక్కువ అని నేను వెనకాడాను. కానీ, రాజుగారు ప్రోత్సహించడంతో అక్కడ చేశాం. అదే వేరే నిర్మాత అయితే వైజాగ్‌లో కానిచ్చేయమనేవారేమో (నవ్వుతూ). ♦ హరీశ్ నిర్మాతల హీరో. ఈ సినిమాతో తనకూ, హీరోయిన్ అవంతికకూ మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇక సాయికుమార్ రోల్ కథను కీలక మలుపు తిప్పుతుంది. సరస్వతమ్మ పాత్రలో యాక్ట్ చేసిన రమాప్రభగారి నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. వసంత్ మంచి పాటలు ఇచ్చారు. పాటలు చూసి, నాగచైతన్య బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమాలో ‘చిలకా... చిలకా’ సాంగ్ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ♦ డైరెక్షన్ నా హాబీ. అన్ని విషయాలు నా గ్రిప్‌లో ఉన్నాయనుకుంటేనే సినిమా తీస్తా. కథ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటాను. పది, పదిహేను కథలు విన్నాకే ‘వైశాఖం’ కథను ఫైనల్ చేశా. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. -
భానుమతి వలలో...
అసలెప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారా? – హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో కొత్తగా అద్దెకొచ్చిన భానుమతిని ఈ ప్రశ్న వెంటాడింది. వెంటనే ఓ డేరింగ్ స్టెప్ వేసింది. అపార్ట్మెంట్లో పరిచయమైన ఓ అబ్బాయికి వల వేసి, వాడుకోవడం మొదలుపెట్టింది. ఈవిడగారి వాడకం ఎలా ఉందనేది ఈ నెల 21న చూపిస్తామంటున్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిన్మా గురించి బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘అపార్ట్మెంట్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఆల్రెడీ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, థీమ్ టీజర్, డీజే వసంత్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రేజ్ చూసి సీడెడ్ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన ‘శ్రీసాయిచంద్ర ఫిల్మ్స్’ నరసింహ విశాఖ కూడా తీసుకున్నారు. ప్రతి ఏరియాకి నలుగురైదుగురు బయ్యర్స్ పోటీ పడుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
వైశాఖం సూపర్ హిట్ అవ్వాలి
– నాగచైతన్య ‘‘సినిమా పరిశ్రమ అభివృద్ధి అవ్వాలంటే కొత్త వాళ్లను, ప్రతిభావంతులను ప్రొత్సహించాలి. అప్పుడు మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. మంచి కథతో వస్తే ‘ఆర్.జె. సినిమాస్’లో నేను సినిమా చేస్తా’’ అన్నారు హీరో నాగచైతన్య. హరీశ్, అవంతిక జంటగా జయ. బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. ఈ సినిమా థీమ్ టీజర్‌ను ఇప్పటి వరకు సుమారు 32 లక్షలమంది చూశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ వంటి మంచి చిత్రాన్ని చేసిన జయగారికి కంగ్రాట్స్. సాంగ్స్ విజువల్‌గా బాగున్నాయి. హరీశ్, అవంతిక లుక్స్ సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్, పబ్లిసిటీ విషయాల్లో రాజుగారు నాకు, అక్కినేని కుంటుంబానికి ఇచ్చిన సపోర్ట్‌ను మరవలేను’’ అన్నారు. ‘‘ఆర్టిస్టుగా, స్టార్‌గా పైస్థాయికి ఎదుగుతున్న చైతు మా సినిమాకి విషెస్ చెప్పడం హ్యాపీగా ఉంది. ఈ నెలలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం అన్నారు’’ బీఏ రాజు. ‘‘కొంతమంది హీరోలను చూసి నప్పుడు మంచి హీరో, పక్కింటి అబ్బాయిలా ఉంటా డనుకుంటారు. కానీ, నాగచైతన్య మా ఇంట్లో అబ్బాయి లా అనిపిస్తాడు. తను మా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు జయ. బి. ఈ చిత్రానికి సహనిర్మాత: అమరనేని నరేష్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
... ప్లస్ కౌంటింగ్!
హరీశ్, అవంతిక... తెలుగు తెరకు ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తే. కానీ, వీళ్లిద్దరూ జంటగా నటించిన ‘వైశాఖం’ థీమ్ టీజర్‌ను యూట్యూబ్‌లో 30 లక్షల మంది చూశారు! రోజు రోజుకీ వ్యూస్ కౌంట్ పెరుగుతోంది కూడా. ‘చంటిగాడు, ప్రేమికుడు, లవ్లీ’ వంటి హిట్ సినిమాలు తీసిన బి. జయ ఈ సినిమాకు దర్శకురాలు కావడంతో కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమాపై ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆర్.జె. సినిమాస్‌పై బీఏ రాజు నిర్మించిన ఈ ‘వైశాఖం’ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథతో ఈ సినిమాను రూపొందించామని బీఏ రాజు తెలిపారు. రోజు రోజుకీ తగ్గుతున్న కుటుంబ విలువలు, అనుబంధాలకు ప్రతిబింబంగా ఈ సినిమా ఉంటుందన్నారు దర్శకురాలు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
జయగారు డబ్బులొచ్చే సినిమాలే తీశారు!
– వీవీ వినాయక్ ‘‘జయగారి సినిమాల్లో హిట్, యావరేజ్ సినిమాలున్నాయి. అయితే, వాటి వల్ల ఎవరికీ ఒక్క రూపాయి నష్టం రాలేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు... అందరికీ డబ్బులొచ్చే సినిమాలే తీశారు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ పబ్లిసిటీ టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. అలాగే, ఇటీవల విడుదలైన థీమ్ టీజర్ 2.5 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘మహిళా దర్శకురాలు ఎనిమిది సినిమాలు తీయడమంటే తమాషా కాదు. విజయ నిర్మలగారి తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు తీసిన ఘనత జయగారిదే. ‘వైశాఖం’ ట్రైలర్, పాటలు బాగున్నాయి. జయగారు తీసిన సినిమాల్లో ‘లవ్లీ’ పెద్ద హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. మంచి డేట్, థియేటర్లు లభించిన తర్వాత సినిమాను విడుదల చేయమని సలహా ఇస్తున్నా’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు ఎంతో మంచి మనిషి. ఆయన ఈ వేడుకకు రావడం మా అదృష్టం. ప్రేక్షకులు మెచ్చేలా ‘వైశాఖం’ ఉంటుంది’’ అన్నారు బి. జయ. నిర్మాత బీఏ రాజు, హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, నటుడు పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
తొంభై సినిమాలంటే మాటలు కాదు
► మాజీ గవర్నర్ రోశయ్య ‘‘ఓ సినిమా తీసేందుకు ఎన్నో కష్టాలు పడాలంటుంటారు. అలాంటిది మా రామసత్యనారాయణ 90 సినిమాలు తీశాడంటే మాటలు కాదు. చాలా గ్రేట్. తెలివిగా, బడ్జెట్ కంట్రోల్‌తో కష్టనష్టాల్ని దగ్గరికి రానివ్వకుండా సినిమాలు నిర్మిస్తున్నారంటే హ్యాపీ’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య అన్నారు. ‘అవును’ ఫేమ్ పూర్ణ ముఖ్యతారగా శ్రీరాజ్ బళ్ల దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘అవంతిక’ పాటల సీడీలను రోశయ్య విడుదల చేయగా, దర్శకులు ‘ధవళ’ సత్యం అందుకున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘మా గురువుగారు దాసరి చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. సినిమాను ఆయనకు అంకితం ఇస్తున్నా. ఓ సినిమా హిట్టవ్వాలంటే నిర్మాత డబ్బు పెడితే సరిపోదు. దర్శకుడు బాగా తీయాలి. అప్పుడే హిట్ వస్తుంది. శ్రీరాజ్ బళ్ల చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైమ్‌లో సినిమా తీశాడు. ఈ నెల 16న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దర్శకులు రేలంగి నరసింహారావు, కళ్యాణ్‌కృష్ణ, బాబ్జీ, సూర్యకిరణ్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, కొడాలి వెంకటేశ్వరరావు, చిత్ర సంగీత దర్శకుడు రవిరాజా బళ్ల పాల్గొన్నారు. -
ఒక్క రోజులో 13 లక్షలు!
స్టార్ హీరోల సిన్మాల కొత్త టీజర్లు, ట్రైలర్లు విడుదలైతే... నెట్టింట్లో హిట్టుల మీద హిట్టులు, లైకుల మీద లైకులు వచ్చేస్తాయి. అదే కొత్త హీరో, హీరోయిన్ నటిస్తున్న సినిమా టీజర్‌ను విడుదలైన ఒక్క రోజులో 13 లక్షలమంది చూశారంటే... ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఎంత క్రేజ్ ఉందనేదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ సినిమా థీమ్ టీజర్‌ను దర్శకుడు కొరటాల శివ మంగళవారం విడుదల చేశారు. నిర్మాత బీఏ రాజు మాట్లాడుతూ – ‘‘ఒక్క రోజులో టీజర్‌కు 1.3 మిలియన్ వ్యూస్ రావడం హ్యాపీ. క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్. -
మూఢ నమ్మకాలపై... ‘అవంతిక’
‘అవంతిక’ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిత్రుడు రామసత్యనారాయణ స్వయం కృషితో ఇప్పటికి 90 చిత్రాలు నిర్మించారు. త్వరలోనే వంద చిత్రాలు పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది’’ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘అవంతిక’. ఈ సినిమా ట్రైలర్‌ను రోశయ్య విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో పలువురు మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే మా చిత్రాన్ని శ్రీరాజ్ బాగా తెరకెక్కించాడు. 2017లో వంద సినిమాల మైలురాయిని పూర్తి చేయాలనుకుంటున్నా. నా వందో చిత్రం ప్రారంభోత్సవం రోశయ్యగారి చేతుల మీదుగానే జరుపుతా’’ అన్నారు. శ్రీరాజ్ బళ్లా, నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్, నటీనటులు గీతాంజలి, శివాజీరాజా, కృష్ణుడు, సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసారి, సంగీతం: రవిరాజ్ బళ్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ధీరజ అప్పాజీ, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్. -
నేను ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాను
-
అరుంధతితో పోల్చడం ఆనందం!
దేవుడికి జంతు బలినిస్తే మంచి జరుగుతుందనే ఆచారం నేపథ్యంలో రూపొందుతున్న హారర్ సినిమా ‘అవంతిక’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పూర్ణ, గీతాంజలి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ప్రస్తుత సమాజంలో బర్నింగ్ ఇష్యూని సినిమాలో ప్రస్తావిస్తున్నాం’’ అని శ్రీరాజ్ బళ్ళా అన్నారు. ‘‘34 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుష్క ‘అరుంధతి’తో ఈ సినిమాని పోల్చడం నా అదృష్టం’’ అన్నారు పూర్ణ. చిత్ర సమర్పకులు కేఆర్ ఫణిరాజ్ పాల్గొన్నారు. -
తర్వాతి సినిమాలోనూ అతనే హీరో!
హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘నాకు బాగా దగ్గరయిన కథ ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా సినిమాలో నవరసాలు ఉన్నాయి. హరీశ్ న్యాచురల్ పెర్ఫార్మర్’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. యూత్, ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఆగస్టు, సెప్టెంబర్లలో జరిగే షెడ్యూళ్లతో షూటింగ్ పూర్తవుతుంది. మా సంస్థ తదుపరి సినిమాలో కూడా హరీశ్‌ని హీరోగా తీసుకున్నాం’’ అన్నారు. ‘‘రెండు మూడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఉపయోగించిన స్పైడర్ క్యామ్‌ను ఈ సినిమాకి ఉపయో గిస్తున్నాం’’ అని సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ నచ్చేలా వైశాఖం
మహిళా దర్శకుల్లో ‘డైనమిక్’ అనిపించుకున్న వాళ్లల్లో జయ బి. ఒకరు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. ఈ నెల 20న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. జయ బి. మాట్లాడుతూ- ‘‘నైట్ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్, కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నాం. సరికొత్త కథాంశంతో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌తో పాటు అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు. ‘‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్లో తెరకెక్కిస్తున్నాం. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని బీఏ రాజు చెప్పారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
కొత్తవాళ్లతో ఎంటర్టైనర్
అశోక్ రాయల్, అవంతిక, కీర్తికలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించ నున్న చిత్రం ‘సింధూర’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మామిడి హరికృష్ణ కెమేరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్ చైర్మన్ కె.స్వామిగౌడ్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సినిమాటోగ్రాఫర్స్‌గా అమర్నాథ్, విశ్వనాథ్‌లను పరిచయం చేస్తున్నాం’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా దైవ నిర్ణయం!
‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఓ పాత్ర కోసం నన్ను సంప్రతించారు. అప్పుడు మా అబ్బాయిని చూసి హీరో చేద్దామని అడిగారు. ఇదంతా దైవ నిర్ణయంగా భావించి ఓకే చెప్పాను’’ అని నటుడు బాలాజీ చెప్పారు. సీరియల్స్, సినిమాల ద్వారా బాలాజీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన తనయుడు రోహన్ హీరోగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపి కాకర్ల దర్శకత్వంలో ఉమ నిర్మిస్తున్న చిత్రం ‘అవంతిక’. మనీషా కథానాయిక. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్‌ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఇద్దరు ప్రేమికులు తమకెదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. లవర్‌బోయ్ పాత్రలో కనిపించనున్నానని హీరో రోహన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే శావలి, కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్: వినాయక్. -
ఇంద్రజను తలపిస్తున్న అవంతిక
‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రాన్ని పునర్నిర్మించాలనుకుంటే... అందులో శ్రీదేవి పోషించిన ఇంద్రజ పాత్ర కోసం ప్రత్యేకించి గాలించాల్సిన పని లేదు. తమన్నా... ఆ పాత్రకు పర్ఫెక్ట్. ఆదివారం మీడియాకు విడుదల చేసిన ‘బాహుబలి’లో తమన్నా ఫస్ట్ లుక్‌ని చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. పోగొట్టుకున్న అంగుళీయకం కోసం దివి నుంచి భువికేతెంచిన ఇంద్రజలా... తళతళ మెరిసిపోతున్నారీ ఫస్ట్ లుక్‌లో తమన్నా. దర్శకుడు రాజమౌళిపై తన గురువు కె.రాఘవేంద్రరావు ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమైపోతుంది. ఇందులో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రికి జోడీగా అనుష్క నటిస్తుండగా, కొడుకు పాత్రతో తమన్నా జతకడుతున్నారు. ఇందులో తమన్నా పాత్ర పేరు అవంతిక. రానా ప్రతినాయకునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు. 2015లో ‘బాహుబలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. -
సినిమా రివ్యూ: కొద్దిసేపే ‘మాయ’
విభిన్నమైన కథలు, వాటిని విచిత్రంగా నడిపిస్తూ తెరపై చూపే శైలి హాలీవుడ్ చిత్రాలకు అలవాటే. కానీ, అలాంటి దోవలో ప్రయాణించడం తెలుగు తెరపై అరుదు. అలాంటి అరుదైనయత్నం చేయడానికి సిద్ధపడినప్పుడు, ప్రేక్షకుడికి ఆశ్చర్యమో, ఆనందమో కలగాలి. అలాకాక, కేవలం ఇంగ్లీష్ చిత్రాల అనుసరణే వరకే ఆ ప్రయోగశీలతను పరిమితం చేస్తే, ఇబ్బంది. ఈ నేపథ్యంలో నుంచి ‘మాయ’ను చూడాలి. కథలోకి వస్తే... జరగబోయేది ముందే తెలిస్తే..? అలాంటి దృష్టి ఎవరికైనా ఉంటే..? మేఘన (అవంతికా మిశ్రా)కు చిన్నప్పటి నుంచి అతీంద్రియ దృష్టి (ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ - ఇ.ఎస్.పి) ఉంటుంది. చిన్నప్పుడు ఓ దుర్ఘటనలో అమ్మ ప్రాణాలు కోల్పోనుందన్న సంగతి కూడా చిన్నప్పుడే తెలిసిన అమ్మాయి ఆమె. పెద్దయ్యాక ‘టీవీ 21’లో రిపోర్టర్‌గా సామాజిక అంశాలపై పోరాటం చేస్తుంటుంది. ఆమె జీవితంలోకి ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ వర్మ అలియాస్ సిద్ధూ (హర్షవర్ధన్ రాణే) ప్రవేశిస్తాడు. వారిద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇంతలో అతనికి కాబోయే భార్యనంటూ మేఘన చిన్నప్పటి ఫ్రెండ్ పూజ (సుష్మా రాజ్) ప్రవేశిస్తుంది. పూజ జీవితంలో జరగబోయే ఓ ఘటన మేఘన ఇ.ఎస్.పికి ముందే అందుతుంది. సిద్ధూకు ఓ భయంకరమైన గతం ఉందని తెలుస్తుంది. అప్పుడేమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... కాస్తంత నెగటివ్ టచ్ ఉన్న పాత్రలకు ఇప్పుడిక హర్షవర్ధన్ రాణే కొత్త చిరునామాగా మారాడనుకోవచ్చు. ముగ్గురు కొత్త నాయికలూ చూడడానికైతే బాగానే ఉన్నారు. అంతకు మించి ఆశిస్తే కష్టం. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్‌కి సంగీతం, కెమేరా వర్క్, సౌండ్ ఎఫెక్ట్లు ప్రాణం పెట్టాయి. సందర్భోచిత గీతాలు కొన్ని పెట్టారు కానీ, అందులో ఒకటి రెండైతే నిడివినీ, ప్రేక్షకుల అసహనాన్నీ పెంచడానికే ఉపకరించాయి. ఏ సీనుకు ఆ సీనే... ఆసక్తికరమైన ప్రారంభ దృశ్యంతో వెండితెరపై ‘మాయ’ మొదలవుతుంది. అక్కడ చిన్నారి మేఘన పాత్రధారితో చేయించిన అభినయం, సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి. అలా ఆసక్తికరమైన అనుభవం కోసం మొదలైన ప్రేక్షకుల జర్నీ కాసేపటికే ఇది ప్యాసింజర్ బండిలో ప్రయాణంగా మారుతుంది. అప్పుడే ప్రథమార్ధం అయిపోయిందా అనిపించే ఈ సినిమా ఆ తరువాత క్రమంగా గాడి తప్పుతుంది. ఆ తరువాత మళ్ళీ మునుపటి ‘మాయ’ కనిపించే ఘట్టాలు తక్కువే. దర్శక, రచయిత ఏ సీను రాసుకున్నప్పుడు ఆ సీనుకు తగ్గట్లు పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి. సిద్ధూ పాత్ర లాంటివి పాజిటివ్, నెగటివ్‌లకు రెంటికీ కాకుండా పోయాయి. అప్పటి దాకా జరగబోయేది తెలుస్తున్న నాయికకు ఉన్నట్టుండి, జరిగిపోయిన సంఘటన తెలియడమనేది నప్పని విషయం. కథ నడిపించడం కోసం దర్శక, రచయిత తనకు తాను కల్పించుకున్న ఓ వెసులుబాటు. అలాగే, ఎన్నో ఏళ్ళ క్రితం చిన్నప్పటి ఫ్రెండైన కథానాయికను పూజ పాత్ర చటుక్కున ఎలా గుర్తించేస్తుందని అడగకండి. ఇక, ద్వితీయార్ధంలో ఫ్యాషన్ షో ఎపిసోడ్ దగ్గర ‘ఢిల్లీ, రాత్రి వేళ...’ అంటూ వేసిన లొకేషన్ ఇండికేషన్ టైటిల్ మరింత గందరగోళం రేపింది. కథ ఆ క్షణానికి జరుగుతున్నది ఢిల్లీలోనా, హైదరాబాద్‌లోనా అన్నది అర్థం కాదు. సిద్ధూ పాత్ర, పోలీసు అధికారి కలసి చివరలో వెతుకులాట, ‘చంపడం మినహా మరో మార్గం లేద’నుకోవడం లాంటి వాటికి కథలో సరైన భూమిక లేదు. చివరలో నాయిక పాత్ర ద్వారా వేరొకరి ద్వారా సస్పెన్స్ ముడిని విప్పించడం తృప్తినివ్వదు. వెరసి, మూడు ముఖ్య పాత్రలు, వారి వారి కోణాల నుంచి కథ నడవడమనే అంశం బాగుందనిపించినా, రెండు గంటల సినిమా చూశాక, అర్ధాకలితో బయటకొచ్చిన భావనే మిగులుతుంది. తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, కెమేరా: బాల్‌రెడ్డి, నిర్మాతలు: ఎం.వి.కె. రెడ్డి, ‘మధుర’ శ్రీధర్, రచన,దర్శకత్వం: నీలకంఠ బలాలు: విలక్షణమైన కథాంశం. సౌండ్ ఎఫెక్ట్లు తెరపై సినిమాను రిచ్‌గా కనిపించేలా చూపిన నాణ్యమైన నిర్మాణం బలహీనతలు: అతి నిదా...నంగా సాగే చిత్ర కథనం అందరూ కొత్త ముఖాలే కావడం ఆకట్టుకోని హీరోయిన్ నటన ఖంగాళీగా సాగే ద్వితీయార్ధం. - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: మాయ
నటీనటులు: హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి నిర్మాత: మధుర శ్రీధర్ దర్శకుడు: నీలకంఠ ప్లస్ పాయింట్స్: కథనం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల్లో ఉండే వేగం లేకపోవడం, వినోదం లేకపోవడం షో చిత్రంతో జాతీయ అవార్డు, మిస్సమ్మ చిత్రంతో ప్రేక్షకులు అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నీలకంఠ తాజాగా హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్ లతో 'మాయ'చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్, థ్రిలర్ రూపొందిన ఈ చిత్రం మాయ చేసిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఓ టెలివిజన్ రిపోర్టర్ గా పనిచేసే మేఘన (అవంతిక మిశ్రా) చిన్నతనం నుంచి జరగబోయే సంఘటనలు ముందే తెలిసే ఈఎస్పీ (ఎక్స్ ట్రా సెన్సరీ పర్ సెప్షన్) అనే వ్యాధితో బాధపడుతుంటుంది. వృత్తిలో భాగంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్థ్ వర్మ (హర్షవర్ధన్ రాణే)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సిద్ధూ, మేఘన ఒకర్నిమరొకరు ప్రేమించుకుంటారు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు పూజా(సుష్మా రాజ్)కు సిద్దూకి పెళ్లి కుదిరిందనే నిజం తెలుస్తుంది. అంతేకాకుండా సిద్దూ ఫస్ట్ లవర్ వైశాలి (నందిని రాయ్) రోడ్డు ప్రమాదంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందుతుంది. వైశాలి మృతి విషయంలో సిద్దూపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఇలా ఉండగా పూజాను సిద్దూ చంపబోతున్నట్టు మేఘనకు ముందే తెలుస్తుంది. పూజాను సిద్దూ నిజంగానే చంపుతాడా? పూజాను సిద్దూ ఎందుకు చంపాల్సి వస్తుంది? తన స్నేహితురాలు పూజాను మేఘన రక్షించుకుంటుందా? వైశాలి మృతి వెనుక కారణాలేంటి? వైశాలి మృతి విషయంలో సిద్దూపై ఎందుకు అనుమానాలు తెలుత్తాయి అనే ప్రశ్నలకు సమాధానమే 'మాయ'. మేఘన పాత్రలో అవంతిక మిశ్రాకు ఈ చిత్రంలో కీలకపాత్ర లభించింది. గ్లామరస్ గా కనిపించింది. కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను పర్వాలేదనిపించే స్థాయిలో పోషించింది. ఫ్యాషన్ డిజైనర్ పాత్రను పోషించిన హర్షవర్ధన్ రాణేకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కించుకున్నారు. కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో తడబాటుకు గురైనాడు. కాని మిగితా చిత్రాలతో పొల్చుకుంటే హర్షకు ఇంపార్టెంట్ పాత్రనే ఈ చిత్రంలో లభించింది. యాక్టింగ్, హావభావాలు పలికించడంలోను మరికొంత మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చిత్రంలో పూజా పాత్రలో సుష్మా రాజ్ కనిపించింది. చిత్రంలో మరో కీలక పాత్రలో సుష్మా తన మార్కును ప్రదర్శించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంది. సిద్దూకి ప్రియురాళిగా నటించిన నందిని రాయ్ ది అంతగా ప్రాధాన్యత లేని పాత్రే. నాగబాబు, ఝాన్సీ అతిధి పాత్రలకే పరిమితమయ్యారు. టెక్నికల్: ఓ హారర్, థ్రిల్లర్ చిత్రాలకు అవసరమయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి శేఖర్ చంద్ర ఆకట్టుకున్నారు. పాటలు అంతగా గుర్తుంచుకునేలా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అని చెప్పవచ్చు. బాల్ రెడ్డి ఫోటోగ్రఫి క్వాలిటీ పరంగా బాగుంది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎప్పుడూ విభిన్న కథాంశంతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు నీలకంఠ తాజాగా మరో ప్రయోగం మాయతో ముందుకొచ్చారు. తొలి సీన్ లోనే థ్రిల్ కలిగించి నీలకంఠ ఆకట్టుకున్నారు. ఆతర్వాత కథ నత్తనడక సాగడంతో తొలి భాగం కొంత విసుగు పుట్టించే విధంగా ఉంటుంది. ఇక రెండవ భాగంలో హీరోపై అనుమానాలు రేకెత్తించి కొంత ఆసక్తిని రేపాడు. క్లైమాక్స్ లో ఊహించని విధంగా కథను కీలక మలుపు తిప్పి నీలకంఠ తన మార్కును చూపించారు. ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టి ఉంటే కొంత వేగం పెరిగి ఉండేది. ప్రేక్షకుడ్ని థియేటర్ కు రప్పించే బలమైన అంశాలు లేకపోవడం కొంత నిరాశే. ఓవరాల్ గా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ప్రస్తుత ట్రెండ్ లో నీలకంఠ తాజా థ్రిల్లర్ చిత్రం 'మాయ' చేస్తుందా అనే విషయం తెలుసుకోవాలంటే కొద్ది రోజులాగాల్సిందే. -
మాయ మూవీ ప్రెస్ మీట్
-
ధోతీ పాట హంగామా
‘‘అతీంద్రియ దృష్టి నేపథ్యంలో ఇతర భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది తొలి ప్రయత్నం కాదు. కానీ, ఓ కొత్త అంశంతో ఈ సినిమా చేశాను. వైవిధ్యభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే చక్కని థ్రిల్లర్ ఇది. సినిమా విజయం మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని దర్శకుడు నీలకంఠ చెప్పారు. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మా, నందినీరాయ్ ముఖ్య తారలుగా షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై ఎమ్వీకే రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మాయ’. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భగా శుక్రవారం లగడపాటి శ్రీధర్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు ‘పోకిరి రాజా..’ పాట కూడా ముందుకు నడుస్తుంది. దాన్ని రీమిక్స్ చేశాం. అతి తక్కువ సమయంలో ఈ ‘ధోతీ సాంగ్..’ను చిత్రీకరించాం. ఇది ఇతివృత్తం మీద ఆధారపడిన చిత్రం’’ అన్నారు. ప్రచార గీతం చాలా బాగుందనీ, ఈ చిత్రం నీలకంఠకు మంచి పేరు తెస్తుందనీ లగడపాటి శ్రీధర్ చెప్పారు. ఇంకా హర్షవర్ధన్ రాణే, సిరాశ్రీ, రమ తదితరులు పాల్గొన్నారు. -
అరవింద్‌కృష్ణ యాక్షన్.
అరవింద్‌కృష్ణ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. అవంతిక, జాహ్నవి కథానాయికలు. భార్గవ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.రంగారావు నిర్మాత. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణరాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రంగారావు క్లాప్ ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ చేయని మాస్ పాత్రను ఇందులో చేస్తున్నానని, కళాశాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అరవింద్‌కృష్ణ చెప్పారు. ‘‘నాగరాజు సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మూడు షెడ్యూళ్లను హైదరాబాద్ పరిసరాల్లో 45 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధునందన్, బెనర్జీ, రవిబాబు, కాశీవిశ్వనాథ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజ్ ఉండ్రమట్ల, సంగీతం: మైఖేల్ మక్కల్, కూర్పు: ధర్మేంద్ర, కళ: రాము.