
కామెడీ థ్రిల్లర్
తెలుగు, హిందీ, మలయాళంలో పలు చిత్రాలకు స్వరాలందించిన సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ కీలక పాత్రలో నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘రావోయి.. మా ఇంటికి’. ఆయనే స్వరకర్త. శ్రీధర్, కావ్యా సింగ్, అవంతిక ముఖ్యతారలు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మించారు.
ఈ చిత్రం పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేసి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు. ‘‘కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కథే మా చిత్రంలో హీరో. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉంటుంది. పాటలు, సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాకేత్ సాయిరామ్. ‘‘కామెడీ చిత్రమైనా నా పాత్రలో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి’’ అన్నారు హీరో శ్రీధర్. అవంతిక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె. దిలీప్ కుమార్ రెడ్డి, డి.కె. గోయల్ పాల్గొన్నారు.