ఇష్టం+కష్టం= వైశాఖం | 'Vaishakhham' will be released on the 21st of this month. | Sakshi
Sakshi News home page

ఇష్టం+కష్టం= వైశాఖం

Published Wed, Jul 12 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

ఇష్టం+కష్టం= వైశాఖం

ఇష్టం+కష్టం= వైశాఖం

‘‘నా గత చిత్రాలకూ, ‘వైశాఖం’కీ చాలా డిఫరెన్స్‌ ఉంది. కథ–కథనాలు ఎలానూ డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే టేకింగ్‌ వైజ్‌గా ఎక్కువ టైమ్‌ తీసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు సినిమాలప్పుడు త్వరగా తీసేయాలని ఒక టైమ్‌ ఫిక్స్‌ చేసుకునేదాన్ని. ఈ సినిమాని చాలా కూల్‌గా తీశాను. అవుట్‌పుట్‌ చూస్తే అది అర్థమవుతుంది’’ అన్నారు జయ. బి. హరీష్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో ఆర్‌. జె సినిమాస్‌ బ్యానర్‌పై బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ. బి చెప్పిన విశేషాలు

ఇప్పుడు అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. అందులో నివసించే వ్యక్తుల మధ్య వచ్చే చిన్న చిన్న క్లాషెస్, రిలేషన్‌షిప్స్‌ ఎలా ఉంటాయన్నదే ‘వైశాఖం’ కథ. ఓ వాస్తవ సంఘటనను ఈ సినిమాలో చూపించాం. స్రీన్‌–ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలోని క్యారెక్టర్స్‌తో ఇన్వాల్వ్‌ అయి ప్రేక్షకులు సినిమాను చూస్తారు. ఒకానొక దశలో సినిమా చూస్తున్న విషయాన్ని మరచిపోయి రియల్‌ లైఫ్‌లో ట్రావెల్‌ అవుతున్నట్లుగా ప్రేక్షకులు ఫీలవుతారు.

వైశాఖం’ టఫ్‌ జర్నీ. ఏడాది జర్నీలో ఎన్నో అప్‌ అండ్‌ డౌన్స్‌ చూశా. అనుకున్నది అనుకున్నట్లుగా రావాలని రాజీ పడకుండా నిర్మించాం. 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులపాటు ట్రావెల్‌ చేసి, కజికిస్తాన్‌లో సాంగ్స్‌ షూట్‌ చేశాం. అక్కడ మూడు రోజులకొకసారి పాస్‌పోర్ట్‌ స్టాంపింగ్‌ చేయించుకోకపోతే మూడు నెలల జైలు తప్పదు. బడ్జెట్, శ్రమ ఎక్కువైనప్పటికీ లొకేషన్స్‌ బాగుండటంతో రిస్క్‌ చేశాం.
     

నా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువే. కజికిస్తాన్‌లో సాంగ్స్‌ తీస్తే బాగుంటుందనుకున్నప్పుడు బడ్జెట్‌ ఎక్కువ అని నేను వెనకాడాను. కానీ, రాజుగారు ప్రోత్సహించడంతో అక్కడ చేశాం. అదే వేరే నిర్మాత అయితే వైజాగ్‌లో కానిచ్చేయమనేవారేమో (నవ్వుతూ).
     
హరీశ్‌ నిర్మాతల హీరో. ఈ సినిమాతో తనకూ, హీరోయిన్‌ అవంతికకూ మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇక సాయికుమార్‌ రోల్‌ కథను కీలక మలుపు తిప్పుతుంది. సరస్వతమ్మ పాత్రలో యాక్ట్‌ చేసిన రమాప్రభగారి నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. వసంత్‌ మంచి పాటలు ఇచ్చారు. పాటలు చూసి, నాగచైతన్య బాగా ఇంప్రెస్‌ అయ్యారు. సినిమాలో ‘చిలకా... చిలకా’ సాంగ్‌ విజువల్‌ ఫీస్ట్‌లా ఉంటుంది.

♦  డైరెక్షన్‌ నా హాబీ. అన్ని విషయాలు నా గ్రిప్‌లో ఉన్నాయనుకుంటేనే సినిమా తీస్తా. కథ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటాను. పది, పదిహేను కథలు విన్నాకే ‘వైశాఖం’ కథను ఫైనల్‌ చేశా. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement