భానుమతి వలలో... | Vaishakham will be shown on 21st of this month | Sakshi
Sakshi News home page

భానుమతి వలలో...

Published Sun, Jul 9 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

భానుమతి వలలో...

భానుమతి వలలో...

అసలెప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలను వాడుకుని వదిలేస్తారా? – హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్తగా అద్దెకొచ్చిన భానుమతిని ఈ ప్రశ్న వెంటాడింది. వెంటనే ఓ డేరింగ్‌ స్టెప్‌ వేసింది. అపార్ట్‌మెంట్‌లో పరిచయమైన ఓ అబ్బాయికి వల వేసి, వాడుకోవడం మొదలుపెట్టింది. ఈవిడగారి వాడకం ఎలా ఉందనేది ఈ నెల 21న చూపిస్తామంటున్నారు బీఏ రాజు.

హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిన్మా గురించి బీఏ రాజు మాట్లాడుతూ– ‘‘అపార్ట్‌మెంట్‌ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆల్రెడీ విడుదలైన థియేట్రికల్‌ ట్రైలర్, థీమ్‌ టీజర్, డీజే వసంత్‌ స్వరపరిచిన పాటలకు మంచి  స్పందన లభిస్తోంది. ఈ క్రేజ్‌ చూసి సీడెడ్‌ ఏరియా డిస్ట్రిబ్యూట్‌ చేయడానికి వచ్చిన ‘శ్రీసాయిచంద్ర ఫిల్మ్స్‌’ నరసింహ విశాఖ కూడా తీసుకున్నారు. ప్రతి ఏరియాకి నలుగురైదుగురు బయ్యర్స్‌ పోటీ పడుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: బి. శివకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement