
తర్వాతి సినిమాలోనూ అతనే హీరో!
హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బి.జయ మాట్లాడుతూ - ‘‘నాకు బాగా దగ్గరయిన కథ ఇది. లవ్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా సినిమాలో నవరసాలు ఉన్నాయి. హరీశ్ న్యాచురల్ పెర్ఫార్మర్’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
యూత్, ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా ఇది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో జరిగే షెడ్యూళ్లతో షూటింగ్ పూర్తవుతుంది. మా సంస్థ తదుపరి సినిమాలో కూడా హరీశ్‌ని హీరోగా తీసుకున్నాం’’ అన్నారు. ‘‘రెండు మూడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఉపయోగించిన స్పైడర్ క్యామ్‌ను ఈ సినిమాకి ఉపయో గిస్తున్నాం’’ అని సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి సుబ్బారావు అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు పాల్గొన్నారు.