విదేశాలకు సముద్రుడు | samudrudu movie shooting almost completed | Sakshi
Sakshi News home page

విదేశాలకు సముద్రుడు

Published Fri, Jan 17 2020 5:32 AM | Last Updated on Fri, Jan 17 2020 5:32 AM

samudrudu movie shooting almost completed - Sakshi

రమాకాంత్, భానుశ్రీ

రమాకాంత్‌ హీరోగా, భానుశ్రీ, అవంతిక హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్‌ పతాకంపై నగేష్‌ నారదాసి దర్శకత్వంలో బాదావత్‌ కిషన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది. దాదాపు 25 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో చీరల ఓడరేపు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మూడు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన పాటలను విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందట. ‘‘మా సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చీరాల యం.ఎల్‌.ఏ ఆమంచి కృష<మోహన్, అక్కడి పోలీస్‌ వారితోపాటు ప్రజలు మా యూనిట్‌కు ఎంతో సహకరించారు. మత్య్సకారుల కథను కమర్షియల్‌ హంగులతో కలిపి తీశాను. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. సుమన్, ‘చిత్రం’ శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా– వాసు. సహ నిర్మాతలు రామోజు జ్ఞానేశ్వర్, సోములు, రామారావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement